Biggboss 6 : పలు భాషలతో పాటు తెలుగులో సైతం అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్ ఆరో సీజన్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా ప్రారంభమైన ఈ రియాలిటీ షో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతులు ఇచ్చేందుకు సిద్ధమైంది. స్టార్ మాలో సాయంత్రం 6 గంటలకు మొదలైన ఈ షోలో నాగార్జున గ్రాండ్ ఎంట్రీతో ప్రారంభమైంది. ఇక బిగ్‌బాస్ హౌస్‌లోకి ఈసారి 21 మంది కంటెస్టెంట్స్ వెళ్లారు. ఈ 21 మందిలో కొద్ది మంది మాత్రమే జనాలకు తెలుసు. మరికొద్ది పెద్దగా ఎవరికీ తెలియని వారే. ఇక చెప్పినట్టుగానే ఒక కామన్ మ్యాన్‌ని తీసుకొచ్చారు. నిజానికి అతడు కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చినా కూడా బిగ్‌బాస్ రివ్యూల ద్వారా బాగా ఫేమస్ అయిపోయాడు.
ఇక ఐదవ సీజన్‌లో అల్లరి అల్లరి చేస్తూ కప్ కొట్టేసిన వ్యక్తి వీజే సన్ని. అప్పటి సీజన్‌లో అతని ఎంట్రి చూసిన వారెవరికీ కప్ తను కొట్టుకుపోతాడని అంచనా కూడా వేయలేదు. కానీ తనలోని చిలిపితనం, మంచి మనసు చూసి ప్రేక్షకులు విపరీతంగా ఓట్లు వేసి మరీ సన్నీని గెలిపించారు. సన్నీకి కోపం ఎంత ఎక్కువో.. ప్రేమ, జాలి కూడా అంతే ఎక్కువ. మరి రియల్‌గా కూడా అలాగే ఉంటాడో.. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నాడు కాబట్టి అలా ప్రవర్తించాడో కానీ జనాలకు మాత్రం బాగా నచ్చేశాడు. ఇప్పుడు సన్నీ క్లోజ్ ఫ్రెండ్ ఒకరు బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టాడు. అతను ఎవరో మీకు తెలుసా?
Biggboss 6 : సన్నీ అండదండలు బాగానే ఉంటాయి..
18వ కంటెస్టెంట్‌గా రాజశేఖర్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజశేఖర్ స్వతహాగా ఒక మోడల్. మనసు మమత వంటి సీరియల్స్‌తో పాటు మేజర్ సినిమాలోనూ రాజశేఖర్ నటించాడు. కానీ పెద్దగా ఎవరికీ తెలియదు. మనసు మమత సీరియల్ ఫాలో అయ్యేవారికైతే అతను తెలిసే ఉంటాడు. ఇతనే బిగ్‌బాస్ సీజన్-5 విజేత వీజే సన్నీకి క్లోజ్ ఫ్రెండ్ అని సమాచారం. ఇదే నిజమైతే సన్నీ అండదండలు మనోడికి బాగానే ఉంటాయి. అలాగే సన్నీ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా బాగా ఉండే అవకాశం ఉంది. లవర్ బాయ్‌లా ఉండటంతో ఇతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ తన మోడలింగ్‌తో ఆకట్టుకున్న రాజశేఖర్ ఇక మున్ముందు బిగ్‌బాస్-6లో ఎలా అలరిస్తాడో చూడాలి.