Vithika Sheru: వితిక షేరు అందరికీ సుపరిచితురాలే. ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన వితిక.. తర్వాత ప్రముఖ హీరో వరుణ్ సందేశ్ నీ పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ త్రీలో వీరిద్దరూ జంటగా రావడం జరిగింది. వరుణ్ సందేశ్, వితికా షేరు దంపతులు బిగ్ బాస్ షోలో అందరినీ అలరించారు. ఆ సీజన్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్, నటి పునర్నవి భూపాలంతో వీరిద్దరూ కలిసి ఒక గ్యాంగ్ గా ఏర్పడి ఎంతో ఎంటర్టైన్మెంట్ అందించడం జరిగింది.
ఆ టైం లో భర్త వరుణ్ సందేశ్ గెలుపు కోసం వితిక ఎంతగానో ఫైట్ చేసింది. వితిక పెద్దగా రాణించ లేకపోయినా గాని వరుణ్ సందేశ్ సీజన్ 3లో టాప్ ఫైవ్ లో నిలిచాడు. ఆ తర్వాత వితిక పలు టెలివిజన్ షోలలో కూడా రావటం జరిగింది. అయితే ప్రస్తుతం ఎక్కువగా సోషల్ మీడియాలో వీడియోలు ఇంకా ఫోటోలు ద్వారా అభిమానులను ఎంతగానో అలరిస్తూ వస్తోంది.
తన సొంతూరు భీమవరం వెళ్లిన ప్రతిసారి తోటల్లో చీరకట్టులో ఇంకా రకరకాల డ్రస్సులతో వితిక దిగే ఫోటోలు కుర్రకారును ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఇదే తరహాలో వర్షంలో రెడ్ శారీతో తడిసిన అందాలతో వితిక ఫోటో దిగి తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. రెడ్ కలర్ శారీలో తడిసిన అందాలలో వితిక ఫోటో కుర్రకారులో సెగలు పుట్టిస్తూ ఉన్నాయి. దీంతో వితిక తడిచి చూపిస్తున్న అందాలకు ఫోటోలకు భారీ ఎత్తున లైకులు కొడుతున్నారు.