యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకుడిగా విశ్వక్ సేన్ హీరోగా ఒక సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రస్తుతం ఆగిపోయింది. విశ్వక్ సేన్ అన్ ప్రొఫెషనలిజంతో విసుగు చెంది ఈ సినిమా నుంచి అతన్ని తప్పించినట్లు అర్జున్ మీడియా ముందుకి వచ్చి చెప్పారు. అతని కారణంగా ఇప్పటికే ఒకసారి షెడ్యూల్ పోస్ట్ పోన్ చేశామని, మళ్ళీ షూటింగ్ కి కొన్ని గంటల ముందు కారణం చెప్పకుండా ఒక మెసేజ్ పెట్టాడని, అతని కారణంగా షూటింగ్ కి రెడీ అయిన అందరూ కూడా ఇబ్బంది పడినట్లు అర్జున్ చెప్పారు. కెరియర్ లో మొదటి సారిగా అవమానపడ్డానని చెప్పారు. సీనియర్ యాక్టర్ అర్జున్ ఇలా విశ్వక్ సేన్ గురించి చెప్పడంతో అందరి వేళ్ళు అతని వైపే చూపించడం మొదలైంది.
విశ్వక్ సేన్ ఆటిట్యూడ్ ని పాయింట్ చేస్తూ విమర్శలు వినిపించాయి. సరైన సక్సెస్ రాకుండానే పెద్ద హీరో రేంజ్ లో బిల్డ్ అప్ ఇస్తూ పొగరు చూపిస్తున్నాడు అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. విశ్వక్ పుట్టకముందే జై హింద్ సినిమాతో దర్శకుడిగా కూడా అర్జున్ సత్తా చాటాడని, అలాంటి వ్యక్తిని అవమానించాడని విమర్శించారు. ఇదిలా ఉంటే రాజయోగం అనే చిన్న సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ కి విశ్వక్ సేన్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అర్జున్ చేసిన కామెంట్స్ పై రియాక్ట్ అవ్వాలని అతన్ని కోరారు. దీనిపై విశ్వక్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
కంటెంట్ బాగుందని సినిమా ఒప్పుకున్న మాట వాస్తవమే అయినా అందులో నాకు తెలిసిన కొన్ని కరెక్షన్స్ చెప్పానని, వాటిని చేయడానికి అర్జున్ సిద్ధంగా లేరని అన్నాడు. అయితే రిస్క్ చేసి ముందుకి వెళ్ళిపోదామని అనుకున్నా అని, నాలుగు గంటలకె లేచి షూటింగ్ కి బయలుదేరుతూ ఉంటే మొదటి సారి భయం వేసిందని, అందుకే ఈ ఒక్క రోజు ఆగి మాట్లాడుకొని షూటింగ్ కి వెళ్దామని మెసేజ్ పెట్టానని చెప్పాడు. షూటింగ్ రోజు మెసేజ్ పెట్టడం తప్పే అయిన కూడా సగం సినిమా అయ్యాక నచ్చలేదని చెప్పడం కంటే బెటర్ అనిపించింది అని పేర్కొన్నాడు. సినిమా షూటింగ్ మధ్యలో ఏవో కారణాలు చూపిస్తూ నచ్చలేదంటే అప్పుడు నిర్మాతలు నష్టపోతారని, అందుకే ముందే విషయం చెప్పానని, ఏవో చిన్న చిన్న కారణాలకి షూటింగ్ ని వాయిదా వేస్తున్న పరిస్థితితులు ఉన్నాయని, దానిని ఏదో పెద్ద ఇష్యూగా చూపించడం.
నేను అవమానించానని అనడం కరెక్ట్ కాదని అన్నాడు. అయితే అర్జున్ గారికి ఇప్పటికి నేను గౌరవం ఇస్తానని, సినిమా మంచిగా రావాలనే ఉద్దేశ్యంతోనే నేను కరెక్షన్స్ చెప్పానని అన్నాడు. నేను నిర్మాతగా, దర్శకుడిగా, యాక్టర్ గా ఉన్నానని సినిమా కష్టాలు, కెరియర్ ఆరంభంలో అవమానాలు ఎదుర్కొన్నవాడినే అని చెప్పాడు. మళ్ళీ బ్యాక్ కి వెళ్ళకూడదు అనే ఉద్దేశ్యంతోనే కరెక్షన్స్ చెప్పానని అన్నాడు. ఇప్పటి వరకు నేను కొత్త దర్శకులతో సినిమాలు చేశానని, అలాగే సీనియర్ నిర్మాతలతోనే నా సినిమాలు అన్ని తెరకెక్కాయి అని అన్నాడు. నిజంగా నేను అన్ ప్రొఫెషనల్ అని ఒక్కరితో చెప్పించిన ఇండస్ట్రీ వదిలేస్తానని చాలెంజ్ చేశాడు. మరి అర్జున్, విశ్వక్ సేన్ ఇష్యూ ఇండస్ట్రీలో ఎంత వరకు వెళ్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.