Unstoppable 2 : నటుడిగానూ.. ఎమ్మెల్యే గానూ నందమూరి బాలకృష్ణ మనకు తెలుసు. కానీ హోస్ట్‌గా ఎలా ఉంటారు? అన్న వాళ్లకు ‘అన్‌స్టాపబుల్’ సమాధానం చెప్పేసింది. సీజన్ 1ను పూర్తి చేసుకున్న ఈ షో తాజాగా సీజన్ 2ను సైతం ప్రారంభించేసింది. ఇప్పటికే ఒక ఎపిసోడ్ పూర్తైంది. రెండో ఎపిసోడ్ ఈ నెల 21న ప్రసారం కానుంది. బాలయ్య అన్నట్టు స్టార్ షోలకే అమ్మ షోగా అన్‌స్టాపబుల్ నిలిచింది. తొలి షోకి టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. ఆ షో రేటింగ్‌లో దూసుకుపోయింది.
ఇక ఎపిసోడ్ 2లో ‘దుందార్ దాస్’ విశ్వక్ సేన్.. ‘పగ్లా టిల్లు’ సిద్ధు జొన్నలగడ్డ సందడి చేశారు. ఈ షోకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. అసలే అక్కడున్నది తేడా సింగ్.. ఇక ఆయనకు వీరిద్దరూ తోడైతే ఎలా ఉంటుందో తెలిసిందే కదా..సందడే సందడి. ఎంత సందడి అంటే రిలీజైన గంటలోనే ఈ షోకి 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. డీజే టిల్లు సాంగ్‌తో బాలయ్య ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత డీజే టిల్లు సాంగ్‌కు సిద్దు, విశ్వక్‌సేన్‌లతో కలిసి స్టెప్ వేశారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వారిద్దరినీ అడిగి తెలుసుకున్నారు
బయట ఎక్కడైనా కలుస్తుంటారా? మీరిద్దరూ అని బాలయ్య అడగ్గా విశ్వక్‌సేన్ నిన్న గాక మొన్ననే కలిశామని చెప్పాడు.వెంటనే బాలయ్య ఎన్ని పెగ్గులు అయినయ్? అని అడిగారు. ఒకరేమో.. మాస్ కా దాస్ అని.. మరొకరేమో మాస్ కా బాస్ అని..నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? గాఢ్ ఆఫ్ మాస్ అని తన గురించి చెప్పారు బాలయ్య.‘వీడిని పార్టీకి పిలిస్తే.. తెల్లారేదాకా వదలడు’అనుకునే హీరో ఎవరైనా ఉన్నారా? అంటే వెంటనే సిద్దు.. విశ్వక్‌సేన్‌ను చూపించడం చాలా ఫన్నీగా అనిపించింది.‘ఫ్రెండ్ ఇన్ డెహ్రాడూన్’ అంటూ బాలయ్య ఆట పట్టించారు. ఆహాలో ఇది అక్టోబర్ 21న ప్రసారం కానుంది.