Vishnu Priya: ఇప్పుడు మనందరం టెక్నాలజీ యుగంలో ఉన్నాం. ఎక్కడ ఏం జరుగుతుందో క్షణాల్లో తెలుసుకునేందుకు సాంకేతికత ఎంతగానో దోహదపడుతోంది. అదే సమయంలో టెక్నాలజీ వల్ల కొన్ని ఇబ్బందులు కూడా తప్పడం లేదు. సాంకేతికత కొందరు సెలబ్రిటీల పాలిట శాపంగా మారుతోంది. ఏ టెక్నాలజీతో తమను తాము ప్రమోట్ చేసుకుంటూ అవకాశాలు దక్కించుకుంటున్నారో.. అదే టెక్నాలజీ బారిన పడి లేనిపోని తిప్పలు పడుతున్నారు సెలబ్రిటీలు. ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు.
టీవీ షోలు, ప్రైవేట్ సాంగ్స్‌తో యూత్‌లో మంచి పాపులారిటీ సంపాదించారు విష్ణు ప్రియ. ఎప్పుడూ హుషారుగా ఉంటూ, తనదైన స్టయిల్‌లో యాంకరింగ్ చేస్తుంటారు ఆమె. చలాకీగా ఉండే విష్ణు ప్రియ మాటలతో పాటు ఆమె అందానికి కూడా ఆడియెన్స్ ఫిదా అవుతుంటారు. సోషల్ మీడియాలో ఆమె పెట్టే ఫొటోలు బాగా వైరల్ అవుతుంటాయి. అయితే గత కొన్ని నెలలుగా ఈ పాపులర్ యాంకర్‌ను ఓ తంటా వెంటాడుతోంది.
విష్ణు ప్రియకు తప్పని తంటాలు
విష్ణు ప్రియ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని స్వయంగా విష్ణు ప్రియ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఖాతాను విడిపించుకోలేక ఆమె తంటాలు పడుతున్నారట. తన సోషల్ మీడియా అకౌంట్‌ను హ్యాక్ చేసిన కొందరి ఆగడాలు ఆమెకు చికాకు తెప్పిస్తున్నాయట. ఇటీవల విష్ణు ప్రియ ఫేస్‌బుక్ అకౌంట్‌లో కనిపించిన కొన్ని అశ్లీల ఫొటోలు, వీడియోలు అందర్నీ షాక్‌కు గురి చేశాయి.
Vishnu Priya: వదలని హ్యాకర్ల బెడద
ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా న్యూడ్‌గా ఉన్న విష్ణు ప్రియ ఫొటోలను చూసి.. ఆమె మరీ ఇంతగా దిగజారిపోయిందేంటని కొందరు వాపోయారు. అయితే ఈ విషయం తెలుసుకున్న విష్ణు ప్రియ వెంటనే తేరుకున్నారు. తన ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె వివరణ ఇచ్చారు. దయచేసి సపోర్ట్ చేయమని ఫాలోవర్లను ఆమె కోరారు. అయినా ఆమె అకౌంట్‌ను హ్యాక్ చేసిన వారు వెనక్కి తగ్గలేదు. తాజాగా మరోసారి విష్ణు ప్రియ సోషల్ మీడియా ఖాతాల్లో అశ్లీల ఫొటోలు, వీడియోలు కనిపించాయి. ఈ విషయం తెలియడంతో విష్ణు ప్రియ కలత చెందారని తెలుస్తోంది. తన స్టేటస్‌లో బూతు ఫొటోలు, పోర్న్ వీడియోలు పోస్టు చేస్తుండటంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారని సమాచారం.