Vishal: తెలుగు కుర్రాడు, తమిళంలో సెటిలైన విశాల్.. తెలుగు ప్రేక్షకులకూ బాగా దగ్గరయ్యాడు. ఆయన నటించిన చిత్రాలు దాదాపు అన్నీ తెలుగులో డబ్ అవుతాయి. హీరో తర్వాత నిర్మాతగానూ మారాడు విశాల్. తన పేరుతో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ కూడా స్థాపించాడు. కొన్నాళ్ల కిందట ఓ నటితో విశాల్ నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే, తదుపరి పరిణామాలతో వివాహం రద్దు చేసుకున్నారు.
రీసెంట్ గా విశాల్ గురించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. విశాల్ ఓ నటితో ప్రేమాయణంలో ఉన్నాడట. దీనిపై సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం అవుతోంది. అయితే, ఇలాంటివి విశాల్ కు కొత్తేమీ కాదని చెప్పాలి. వరలక్ష్మీ శరత్ కుమార్ తో ప్రేమలో ఉన్నాడనే ప్రచారం కూడాజరిగింది. అయితే, అవన్నీ వదంతులేనని కొట్టి పారేశారు.
ప్రస్తుతం దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విశాల్.. ఇప్పటికీ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్నాడు. అయితే, నటి అభినయ తో తాజాగా ప్రేమలో ఉన్నాడనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారని ఆ గాసిప్స్ సారాంశం.
Vishal: ఖండించని విశాల్.. అవన్నీ వదంతులేనన్న నటి
సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న ఈ ప్రచారంపై నటుడు విశాల్ అయితే ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ నటి అభినయ మాత్రం వీటిపై ఫైర్ అయ్యింది. ప్రస్తుతం విశాల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మార్క్ ఆంటోనీ. ఈ సినిమాలో విశాల్ భార్యగా అభినయ నటిస్తోంది. తమిళనాట నాడోడిగల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె.. పుట్టుకతోనే చెవిటి, మూగ. ఈ లోపాలను జయించి సినిమాల్లో రాణిస్తోంది. విశాల్ తో ప్రేమాయణం వార్తలు పూర్తిగా అసత్యమని అభినయ ఖండించింది. రీల్ లైఫ్ లో మాత్రమే భార్యగా నటిస్తున్నానని, రియల్ లైఫ్ లో భార్య కాగలమా? అని ప్రశ్నించింది.