Vishakapatnam : కాలం మారింది అంటే ఏమో అనుకున్నాం కానీ విశాఖలో పట్టపగలు ఓ చదువకునే యువతీ యువకులు చేసిన వికృత చేష్టలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. తల్లిదండ్రులు చదువుకోండయ్యా అంటూ అన్ని సౌకర్యాలు అందించి ఎలాంటి కష్టం తెలియకుండా పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తుంటే పిల్లలు మాత్రం తమ జల్సాల కోసం వయసుకు మించిన పనులు చేస్తూ విర్రవీగుతున్నారు. ఏం చేస్తున్నాము అన్న విషయాన్ని మరిచిపోయి ప్రపంచాన్ని పక్కన పెట్టి ఎవరేం చేస్తారు లే అని సరదాల బాట పడుతున్నారు. ప్రేమించడం తప్పుకాదు ప్రేమ పేరుతా ఇలా విచ్చలవిడిగా రెచ్చిపోయేవారిని ఏం అనాలని సమాజం వేలెత్తి చూపిస్తోంది. విశాఖ నగరంలో ఇద్దరు లవర్స్ చేసిన పని ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

నగరంలో లవర్స్ హల్ చల్ చేశారు. సాధారణంగా బైక్‌పై ప్రేమికులు హత్తుకుని కూర్చుంటారు. కానీ ఈ ప్రేమికులు మాత్రం మరింత రెచ్చిపోయారు. అబ్బాయి బైక్ నడుపుతుండగా అతనికి ఎదురుగా అమ్మాయి అసభ్యకరంగా కూర్చుని ఉంది. రయ్ రయ్ మంటూ దూసుకెళ్లారు. బైక్ పై లవర్స్ ఇలా వెళ‌్లడాన్ని చూసి ఆశ్చర్యపోయారు..

అటువైపుగా వెళ్తున్న కారులోని వ్యక్తులు ఈ దృష్యాలను చూసి అవాక్కయ్యారు. వెంటనే తమ ఫోన్ కెమెరా ద్వారా ఈ లవర్స్ ను చిత్రీకరించారు . వారిని ఆపేందుకు ప్రయత్నించినా ఏ మాత్రం ఆగకుండా ఫుల్ స్వీడ్ లో బైక నడపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది. ఇదంతా చూసిన ప్రజలు కలికాలం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ఈ లవర్స్ బైక్ ఫీట్లన్నీ రహదారిపైనే జరిగాయి. అబ్బాయి రయ్ రయ్ మంటు ఫుల్ స్వీడ్ లో బైక్ నడుపుతుంటే అమ్మాయి ఏ మాత్రం భయపడకుండా చూడలేని భంగిమలో కూర్చుని చెలరేగిపోయింది. ఈ వీడియో వైరల్ కావడంతో స్టీల్ ప్రాంట్ పోలీసులు స్పందించారు. గాలింపు చర్యలు చేపట్టిన అనంతరం ఆ అమ్మాయి అబ్బాయిలను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ వెంపలినగర్, సమతానగర్‌కు చెందిన వారికిగా గుర్తించారు. వారి వికృత చేష్టలకు పనిష్‌మెంట్‌గా ఇదద్రిని స్టేషల్‌కు తరలించి కేసు నమోదు చేశారు.