Virushka : కోహ్లీ అనుష్క ల వైవాహిక బంధం ఎంతో హ్యాపీగా సాఫీగా సాగుతోంది. ఈ జంట ఒక్కటై ఐదేళ్లు కావస్తోంది. అయినా వీరి మధ్య ప్రేమ ఇప్పుడే పుట్టిందా అన్నట్టుగా ఉంటుంది. భారత్ లోనే అత్యంత అందమైన ప్రభావవంతమైన సెలబ్రిటీ కపుల్ గా వీరు ఉన్నారు. వీరిద్దరు ఎక్కడున్నా అక్కడ హంగామా వేరే లెవెల్ లో ఉంటుంది . తాజాగా అనుష్క తన మూవీ షూటింగ్ కోసం యూకే కి వెళ్ళింది. విరాట్ అనుష్క ను వదిలి ఉండబట్ట లేక తనతో పాటే యూకే కి చెక్కేశాడు. ఇక యూకే లో మకాం వేసిన వీరిద్దరూ ఊరికే ఉంటారా. అలా చట్టాపట్టాలేసుకుని యూకే వీధుల్లో షికారుకు వెళ్లారు.

Virushka : అక్కడ రోడ్ సైడ్ లో ఉన్న ఒక కాఫీ షాప్ లో పక్కపక్కనే కూర్చుని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతూ ఎంజాయ్ చేశారు ఈ క్యూట్ కపుల్. కాఫీ తాగుతూ ఉన్న పిక్స్ ప్రస్తుతం నేట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ అందమైన కపుల్ నీ చూసి చాలా మంది దంపతులు కుళ్ళు కుంటున్నారట.

Virushka : అనుష్క శర్మ తాజాగా బాలీవుడ్ లో చేక్దా ఎక్స్ ప్రెస్ అనే సినిమా చేస్తోంది. ఈ మూవీ షూటింగ్ నిమిత్తం యునైటెడ్ క్కింగ్డమ్ కు వెళ్ళింది. షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న తర్వాత తన ప్రియ సఖుడు భర్తతో కలిసి కాఫీ ని షేర్ చేసుకుంది అనుష్క. వారిద్దరి క్యూట్ మూమెంట్స్ కెమెరాలో బంధించబడ్డాయి. ఆ పిక్స్ ను తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసింది అనుష్క శర్మ. పిక్స్ కి ఎలాంటి క్యాప్షన్ ను జోడించకపోయినప్పటికీ వారిద్దరి ఆనందాన్ని తెలుసుకున్నారు ఫాలోవర్స్. ఈ పిక్స్ కి హార్ట్ ఎమోజీలు పోస్ట్ చేశారు. ఈ క్యాండిడ్ ఫోటోలు ఎంతో క్యూట్ గా ఉన్నాయి అంటున్నారు నేటిజన్లు.

మరో ఫోటోలో విరాట్ కోహ్లీ అనుష్క శర్మలు దగ్గరగా వచ్చి తమ పెదాలపై చిరునవ్వును చిందిస్తూ మొబైల్ ఫోన్ తో సెల్ఫీ తీసుకున్నారు. ఈ పిక్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు విరాట్. ఈ ఫోటోలకు బ్యూటిఫుల్ మార్నింగ్ అంటూ క్యాప్షన్ ని జోడించారు.