Virat Kohli : కరోనా తగ్గిన తరువాత చాలా ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు చాలా జరిగాయి. టీ20 వరల్డ్‌కప్ 2021 ముగిసి అప్పుడే కావొస్తోంది. ఇప్పుడు 2022 టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఈ ప్రపంచ కప్‌కు టీం ఇండియా రెడీ అవుతుంది.
టీమ్‌ఇండియాలో తన మొదటి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ఈనెల 23న ఆదివారం జరుగుతంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌ను అద్భుత ఆటతీరుతో గెలిచి మంచి ఊపు మీద ఉంది. రెండో వార్మప్ మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో తలపడనుంది.
2024 వ్యూహరచనలు
అయితే 2024 టీ20 ప్రపంచకప్‌పై ఇప్పటి నుండే చర్చలు మొదలయ్యాయి. ఈ టోర్నీకి దాదాపు అన్ని దేశాలు తమ జట్లతో కొన్ని మార్పులు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని క్రికెట్ పండితులు చెబుతున్నారు. కొంతమంది సీనియర్లకు ఉద్వాసన పలికే అవకాశం కూడా ఉందని అంటున్నారు. భారత్ జట్టులో కూడా చాలామంది సీనియర్ ప్లేయర్లు ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ తర్వాత ఇంటర్నేషనల్ టీ20లు ఆడకపోవచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారు ఎవరో చూద్దాం.
Virat Kohli :
దాదాపుగా రిటైర్ అయిపోయి కామెంటర్‌గా మారిన దినేష్ కార్తీక్‌కు ఐపిల్ పుణ్యమా అని మళ్లీ టీమ్‌లో చోటు దక్కింది. ఈ టీ20 వరల్డ్‌కప్ తర్వాత ఆయనకు ఉద్వాసన పలికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే వరుసగా అన్ని ఫార్మెట్‌లలో క్రికెట్ ఆడుతున్న విరాట్ కోహ్లీ కూడా వరల్డ్‌కప్ తర్వాత టీ20 ఫార్మెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.. అలాగే రోహిత్‌శర్మ కూడా ఈ వరల్డ్‌కప్ తర్వాత టీ20 మ్యాచ్‌లకు దూరం కావచ్చు. రెగ్యులర్‌గా గాయాలు పాలవడంతో ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకునేలా ఉన్నారని తెలుస్తోంది.