Virat Kohli: భారత్-బంగ్లాదేశ్ మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ ఆరోపణలు చెలరేగాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ ఆటగాళ్లు, ఆ దేశ అభిమానులు ఈ విమర్శలను ట్రోల్ చేశారు. అయితే కోహ్లీ నిజంగానే ఫేక్ ఫీల్డింగ్ చేశాడని, ఈ విషయాన్ని గ్రౌండ్‌లో ఉన్న అంపైర్లు గుర్తించకపోవడంతో భారత్‌కు లాభం జరిగిందని భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అన్నాడు. అంపైర్లు చూసి ఉంటే.. రూల్స్ ప్రకారం బంగ్లాదేశ్‌కు ఐదు పరుగులు ఇచ్చేవారని అభిప్రాయపడ్డాడు.
అయితే నిజంగానే అంపైర్లు బంగ్లాదేశ్‌కు ఐదు పరుగులు ఇచ్చి ఉంటే భారత్ పరాజయం పాలయ్యేది. కానీ విరాట్ కోహ్లీ సరదాగానే ఈ పని చేశాడని భారత అభిమానులు నమ్ముతున్నారు. కానీ ఆట ప్రకారం చూసుకుంటే నిబంధనలు పాటించాలి కాబట్టి మరోసారి కోహ్లీ ఈ పనిచేయడని కొందరు సమర్ధిస్తున్నారు. అంపైర్లు అప్రమత్తంగా లేరు కాబట్టి భారత్ బతికిపోయిందని.. మరోసారి ఇలా చేస్తే అంపైర్లు గమనించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఫీల్డింగ్ చేసే సమయంలో కీపర్ కార్తీక్ వైపు విసిరిన బంతి కోహ్లీ వైపు దూసుకొచ్చింది. కానీ చేతిలో బంతి లేకుండానే నాన్‌స్ట్రైకర్ వైపు త్రో చేసినట్లు విరాట్ కోహ్లీ యాక్ట్ చేశాడు. కోహ్లీ తమ ఆటగాళ్ల దృష్టి మళ్లించడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించాడని బంగ్లాదేశ్ ఆటగాడు నూరుల్ హసన్ ఆరోపించాడు. కోహ్లీకి జరిమానాగా బంగ్లాదేశ్ జట్టుకు ఐదు పరుగులు ఇచ్చి ఉండాల్సిందని అతడు అభిప్రాయపడ్డాడు.
Virat Kohli:
కాగా ప్రపంచకప్‌లో గ్రూప్-2 సెమీస్ స్థానాలు రేపు ఖరారు కానున్నాయి. గ్రూప్-1లో రెండో స్థానంతో ఇంగ్లండ్ సెమీస్ చేరగా, న్యూజిలాండ్ కూడా ఇప్పటికే సెమీస్‌కు వెళ్లింది. నెట్ రన్‌రేట్‌లో వెనుకబడి ఆస్ట్రేలియా సెమీస్‌కు దూరం కాగా.. ఆదివారం నాడు జింబాబ్వేపై భారత్ నెగ్గితే ఇంగ్లండ్‌తో సెమీస్ ఆడనుంది. ఈరోజే బంగ్లాదేశ్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ల ఫలితాల తర్వాత గ్రూప్-2 నుంచి సెమీస్‌కు వెళ్లే జట్లు ఖరారవనున్నాయి.