Virat Kohli-Anushka : స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల జంట గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అంటే కొన్ని సందర్భాల్లో చెప్పాల్సిందే. ఎందుకంటే ఈ జంట ఒక విషయంలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ జంట ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుంది. షాకింగ్‌గా అనిపిస్తోంది. వీరిద్దరికీ ఇల్లు అద్దెకు తీసుకోవాల్సిన అవసరమేంటి? కొనుక్కోలేని స్థితిలో ఉన్నారా? అంటే తాము అనుకున్న ఏరియాలో అదిరిపోయే వ్యూతో ఉన్న ఇల్లు కొనుక్కోవాలంటే అందుబాటులో ఉండొద్దు. అందుకే అద్దెకు తీసుకునైనా ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు కాబోలు. అదే పని చేశారు.
అయితే ఆసక్తికర విషయం ఏంటంటే.. వీరు ఇంటి అద్దె. వేలల్లో ఉంటుందనుకుంటే తప్పులో కాలేసినట్టే. అక్షరాలా.. నెలకు రూ.2.76 లక్షలు. ఇది తెలిసి అంతా నోరెళ్ల బెడుతున్నారు. ముంబైలోని జుహు ప్రాంతంలో సముద్రానికి ఎదురుగా ఉన్న ప్లాట్‌ను అద్దెకు తీసుకుంది. ఆ ఏరియా.. సముద్రానికి ఎదురుగా అదిరిపోయే వ్యూతో ఉంటుందట. విరాట్ అద్దెకు తీసుకున్న ఇల్లు నాల్గవ అంతస్తులో ఉంటుందట. 1,650 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. సముద్రానికి సరిగ్గా ఎదురుగా ఉంటుంద. ఈ ఫ్లాట్‌లో అండర్ గ్రౌండ్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి.
విరాట్ అద్దెకు తీసుకున్న ఈ అపార్ట్‌మెంట్ వడోదర రాజకుటుంబానికి చెందిన మాజీ క్రికెటర్ సమర్జిత్‌సింగ్ గైక్వాడ్‌కు చెందినదిగా సమాచారం. కాగా.. ఈ జంట ఈ ఏడాదే ఒక ఫామ్ హౌస్‌ను కొనుగోలు చేసింది. సెప్టెంబర్‌లో మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని అలీబాగ్‌లో రూ.19.24 కోట్లతో కొనుగోలు చేసినట్టు సమాచారం. జిరాద్ గ్రామ సమీపంలోని 8 ఎకరాల స్థలంలో దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తానికి అద్దె ఇంటి వ్యవహారంతో ఈ జంట ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది.