Viral video: దీపావళి పండుగను ఎవరుకు తోచిన విధంగా వారు బాణాసంచాలు కాలుస్తూ, టపాకాయలు పేలుస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. కొంతమంది వైవిద్యం కోసం వీటితో విన్యాసాలు కూడా చేయడం మనం చూసాం. అందుకే రాజస్థాన్‌కు చెందిన యూట్యూబర్ అందరిలా దీపావళి చేసుకుంటే కిక్కేముంటుందని భావించాడు. దీపావళి వేడుకలను వినూతన్నంగా ప్లాన్ చేశాడు. ఇప్పుడు ఇతను దీపావళి చేసుకున్న విధానం యావత్ దేశాన్ని ఆశ్చర్యపరుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో దీపావళి ఇలా కూడా చేసుకుంటారా అని అందరు ఈ వీడియో చూసి నోరెళ్లబెడుతున్నారు.
యూట్యూబర్ క్రియేటివిటీ పీక్స్..
రాజస్థాన్‌లోని అల్వార్ ప్రాంతంకు చెందిన అమిత్‌శర్మ పేరొందిన యూట్యూబర్. అందుకే తను చేసే ప్రతి పనిని వినూతన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. దీనిలో భాగంగానే మంచి కండీషన్‌లో ఉన్న తన కారుకు సుమారు లక్ష టపాసులను అమర్చాడు. కారు అద్దలు తప్పించి కారు మొత్తాన్ని క్రేకర్స్‌తో నింపేశాడు. తరువాత మూడు అంకెలు లెక్కపెట్టేలోపే వాటిని పేల్చేశాడు. దీంతో ఆ ప్రదేశమంతా శబ్ధాలతో మారుమ్రోగిపోయింది.
ఈయన దీపావళి సెలబ్రేషన్ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. దీంతో ఈ వీడియోను చూసినవారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే బాంబులు పేలిన తరువాత కారు లోపల భాగమంతా పూర్తిగా మారిపోయింది. కారు మొత్తం పొగతో కమ్మేసింది. అద్దాలు మెత్తబడి పగిలిపోయాయి. అయితే ఇంజన్‌కు మాత్రం ఎటువంటి డ్యామేజ్ జరగలేదు.
Viral video
అయితే ఇతను తన ఇంటి దగ్గరే కారును టపాసులతో అలంకరించి దానిని డ్రైవ్ చేసుకుంటూ నిర్మానుష ప్రదేశానికి వెళ్లి ఈ పని చేశాడు. ఇదంతా అతని స్నేహితులు సెల్‌ఫోన్‌లో బంధించి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోపై పలువురు నెగిటివ్ కామెంట్లు కూడా పెడుతున్నారు. కారు జనావాసాల మధ్య పేలి ఉంటే పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది వెర్రి పని అని కొందరు కామెంట్ చేస్తున్నారు. క్రేజ్ కోసం ఇలాంటి పిచ్చి చర్యలకు పాల్పడడం మంచిది కాదని మరికొందరు ఈయన చర్యలను వ్యతిరేకిస్తున్నారు.