Viral Video: మనుషులు కోతుల నుండి వచ్చారనేది శాస్త్రీయ ఆధారాలతో సహా నిరూపితమైంది. అయితే మానవ పరిణామ క్రమంలో కోతుల కన్నా బెటర్ గా మనిషి ఉంటాడు. కానీ కొందరి విషయంలో మాత్రం మనిషి ఇంకా కోతి లక్షణాలనే కలిగి ఉంటాడనేది లోకులు చెప్పే మాట. అందుకే ఎవరైనా పిచ్చి వేషాలు వేస్తే వీడేంట్రా.. కోతిలాగా చేస్తున్నాడంటూ కామెంట్ చేస్తుంటారు. నెట్టింట కోతులకు సంబంధించిన ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి.
కోతులు పెట్టే ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంటాయి. అందుకే చిన్న పిల్లల దగ్గరి నుండి పెద్దల వరకు కోతులకు సంబంధించిన ఫన్నీ వీడియోలను చూడటానికి ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఫన్నీ కోతి వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు గొల్లున నవ్వడంతో పాటు కోతి అదరగొట్టేసిందంటూ కితాబిస్తున్నారు. ఇంతకీ ఆ వీడియో ఏంటో తెలుసుకుందాం పదండి.
Viral Video:
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ కోతి, మనిషి పక్కపక్కన కూర్చున్నారు.మనిషిని కోతి పలకరిస్తున్నట్లు, పిలుస్తున్నట్లు.. అతన్ని తడుతోంది. దానికి అతడు రియాక్ట్ అవుతూ.. తను పెట్టుకున్న టోపీని తీస్తాడు. అయితే అతను టోపీ తీయగానే.. విచిత్రమైన హెయిర్ స్టైల్ కనిపిస్తుంది. దానిని చూసిన కోతి.. ‘అరె ఏంట్రీ ఈ హెయిర్ స్టైల్’ అన్నట్లు ఎక్స్ ప్రెషన్స్ పెడుతుంది.
కోతి రియాక్షన్ నెట్టింట అందరినీ నచ్చడంతో ఈ వీడియో వైరల్ అయింది. ఇప్పటి వరకు ఈ వీడియోకు 30లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లకు ఈ వీడియో తెగ నచ్చడంతో.. దీనిని బాగా షేర్ చేస్తున్నారు. ఈ వీడియోను బైటెన్‌గిబిడెన్ ట్విట్టర్ ఖాతా సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్లు ఈ వీడియోకు ఫిదా అవుతున్నారు.
If you need a laugh.. 😅 pic.twitter.com/05dO0n9aPm
— Buitengebieden (@buitengebieden) November 6, 2022