Viral Video: హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని దేశవ్యాప్తంగా భారీ ప్రచారం జరుగుతుంది. అయినా ఇప్పిటికీ చాలామంది దీనిని సీరియస్‌గా తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఢిల్లీ పోలీసులు హెల్మెట్ ధరించడం వలన ఒక వ్యక్తి ఏకంగా రెండుసార్లు తన ప్రాణాలను ఎలా కాపాడుకున్నాడో తెలుపుతూ ఒక వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.
ప్రమాదం అనేది ఎప్పుడు ఎటునుండి పొంచి ఉంటుందో మనం చెప్పలేం. మనం జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తు్న్న కొన్నిసార్లు వేరేవ్యక్తుల తప్పిదాల వలన కూడా నష్టం జరగవచ్చు. అందుకే ఎప్పుడూ హెల్మెట్ ధరించాలని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం వివిధ ప్రమాదాల్లో పూర్తిగా ముఖానికి హెల్మెట్ ధరించడం వలన 64శాతం మంది తీవ్ర గాయాల నుండి, 74శాతం మంది తలకు గాయాల బారిన పడకుండా బయటపడ్డారు. తాజాగా హెల్మెట్ ధరించి తన ప్రాణాలను ఏకంగా రెండుసార్లు ఒక వ్యక్తి ఎలా కాపాడుకున్నాడో తెలియజేస్తూ ఢిల్లీ పోలీసులు ఒక వీడియోను తమ ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. బైక్‌పై స్పీడ్‌గా వెళ్తున్న ఒక వ్యక్తి అప్పటికే రోడ్డుపై ఆగివున్న కారు ముందుకు కదలడంతో దానిని తప్పించుకోబోయి ఎదురుగా ఉన్న స్తంభాన్ని ఢీకొట్టి నేలపై పడ్డాడు. అయితే హెల్మెట్ ధరించిన కారణంగా అతనికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అదే సమయంలో అతను ఢీకొట్టిన స్తంభం కూలి తన తలపై పడింది. ఈసారి కూడా అతను ధరించిన హెల్మెటే అతని ప్రాణాలను కాపాడింది. ఇలా ఒకసారి కాదు ఏకంగా రెండుసార్లు హెల్మెట్ ధరించి తన మృత్యుంజయుడుగా నిలిచాడు. అందుకే ఢిల్లీ పోలీసులు హెల్మెట్ ధరించడం పట్ల అవగాహన కల్పించేందుకు ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు.
Viral Video:
హెల్మెట్ ధరించడం వలన ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు.. ఇలా చాలాసార్లు మీరు మీ జీవితాలను కాపాడుకోవచ్చు అనే శీర్షికను కూడా దీనికి జతచేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 26,000 మంది నెటిజన్లు ఈ వీడియోను లైక్ చేయడం గమనార్హం. అంతే కాకుండా ఈ బైకర్‌కు చాలా అదృష్టవంతుడు, ఇతనికి ఇంకా భూమిపై బ్రతికే యోగ్యం ఉంది అంటూ వివిధ కామెంట్లను కూడా పెడుతున్నారు.
God helps those who wear helmet !#RoadSafety#DelhiPoliceCares pic.twitter.com/H2BiF21DDD
— Delhi Police (@DelhiPolice) September 15, 2022