ప్రస్తుత సమాజంలో దంపతుల మధ్య మనస్పర్థలు ఎక్కువై.. చిన్న చిన్న గొడవలకే విడిపోతున్నారు. ఆర్థిక సమస్యలు, భాగస్వామిని అర్థం చేసుకోకపోవడం వంటి అనేక కారణాల వల్ల ఎన్నో జీవితాలు కూలిపోతున్నాయి. అలా పెళ్లైన కొద్ది రోజులకే కోర్టు మెట్లు ఎక్కుతున్న ఎన్నో జంటలను చూశాం. కానీ దానికి విభిన్నంగా ఓ మహిళా ఐఏఎస్ అధికారి వీడియో షేర్ చేశారు. ‘ప్రేమంటే ఏంటి అని ఎవరైనా అడిగితే ఈ వీడియో చూపించండి’ అంటూ క్యాప్షన్ జోడించారు.
అనారోగ్యం కారణంగా తన పనులు కూడా తాను చేసుకోలేని స్థితిలో ఉన్న భర్తకు భార్య ఆహారాన్ని అందించి నీళ్లు కూడా తాగిస్తుంది. వృద్ధురాలైన ఆ భార్య ఒంట్లో శక్తి లేకపోయినా.. భర్త మీద ప్రేమ కారణంగా శక్తినంతా కూడదీసుకుని ఆహారాన్ని అందిస్తుంది. కేవలం పదిహేను సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఆ దంపతులు జీవితకాలం పాటు పెంచుకున్న ప్రేమానురాగాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. దీనిపై డా. సుమిత్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రేమ అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే ఇది చూపించండి’ అంటూ కామెంట్ చేశారు. ఆ వృద్ధదంపతుల అనుబంధం చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే..
హర్యాణా వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అదనపు చీఫ్ సెక్రటరీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న డా. సుమిత్రా మిశ్రా ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ వీడియోను వేల మంది లైక్ చేస్తున్నారు. జీవనపోరాటంలో బిజీ బిజీగా గడిపేసిన ఆ జంటను వృద్ధాప్యం మరింత దగ్గర చేసిందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. చాలామంది ఈ వీడియోను చూసి తమ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..