Viral Video ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీనియర్ లీడర్‌గా కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన రఘువీరారెడ్డి రాష్ట్ర విడిపోయిన తరువాత సీమాంధ్రకు పీసీసీ అధ్యక్షునిగా కూడా బాధ్యతలు చేపట్టారు. అంతేకాకుండా వైఎస్, రోశయ్య కాబినెట్లో పలు మంత్రి పదవులు చేపట్టి అప్పటి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. అయితే ఆ తరువాత ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వయసురీత్యా ప్రస్తుతం ఆయన ఎటువంటి రాజకీయా కార్యక్రమాలలో పాల్గొనడం లేదు. ఇప్పుడు కుటుంబంతో కాలం గడుపుతూ సేదతీరుతున్నారు.
అయితే ఇప్పుడు ఆయన తన మనవరాలితో కలిసి స్టెప్పులేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీవీలో వస్తున్న ఓ పాటకు ఆయన తన హుషారైన స్టెప్టులతో తన మనవరాలితో పాదం కదిపారు. ఇది చూసిన నెటిజెన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వయసులో ఇంత చలాకీగా ఉండడం మీకే చెల్లిందని ఆయన అభిమానులు, నెటిజెన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు.
రాజకీయాలకు దూరమైన తరువాత ఆయన సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న ఫొటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన పెట్టిన ఓ పోస్టు కూడా నెట్టింట్లో వైరల్‌గా మారంది. ఓ బావిని చూపిస్తూ తాను చిన్నప్పుడు ఇదే బావిలో ఈత నేర్చుకున్నానని, ఇప్పుడు ఇదే బావిలో తన మనవరాలికి ఈత నేర్పిస్టున్నానని ఆయన రాసుకొచ్చారు.
Viral Video
అయితే ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయానికి మళ్లీ రాజకీయాల వైపు రావొచ్చని ఆయన సన్నిహితులు కొందరు మాట్లాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అంతంతమాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు ఖచ్చితంగా ఆయన మళ్లీ రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారని కొందరు భావిస్తున్నారు. అయితే ఆయన మాత్రం రాజకీయాలకు దూరంగా కుటుంబంతో కాలం గడుపుతూ సేదతీరుతుండడం విశేషం.
Joyful moments with my Granddaughter.. pic.twitter.com/xD0pBTASj9
— Dr. N Raghuveera Reddy (@drnraghuveera) November 8, 2022