Viral Video: సోషల్ మీడియాలో రోజుకో వీడియో వైరల్ గా మారుతుంటాయి. వాటిని ప్రముఖులు గుర్తిస్తూ తమ ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లలో షేర్లు చేస్తుంటారు. దీంతో వాటికి మరింత ఆదరణ లభిస్తుంటుంది. అలా పాపులరై చాలా మంది లైఫ్ సెటిల్ అవుతుంటుంది. తాజాగా కర్ణాటకలోని హుబ్బల్లి నగరానికి చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఏకంగా ప్రధాని మోదీ మెచ్చుకునే స్థాయికి వెళ్లింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసుకుందాం..
అక్టోబర్ 2న లక్ష్మీ నారాయణ ఓ వీడియో పోస్టు చేశారు. అక్టోబర్ 4న ప్రధాని మోదీ ఆ వీడియోను రీట్వీట్ చేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొందరు యువకులు తమ అపార్ట్ మెంట్స్ దగ్గర క్రికెట్ ఆడుతున్నారు. అయితే, వీడియో క్లిప్ లో ఓ వ్యక్తి సంస్కృతంలో మాట్లాడుతూ, కామెంటరీ చేయసాగాడు. సంస్కృతంలో క్రికెట్ కామెంటరీ చాలా బాగుందంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టడం మొదలు పెట్టారు. ఇది కాస్తా వైరల్ అయ్యింది.
అయితే, దీన్ని సోషల్ మీడియాలో చూసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తన ట్విట్టర్ ఖాతాలో రీట్వీట్ చేస్తూ సదరు వ్యక్తి ప్రతిభను మెచ్చుకున్నారు. ప్రధాని స్పందిస్తూ.. దీన్ని చూడటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి ప్రయత్నం చేసిన వారికి అభినందనలంటూ చెప్పారు. గత ఏడాది మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని.. తాను కాశీలో జరిగిన ఇలాంటి ప్రయత్నానికి చెందిన విషయాన్ని మీతో పంచుకున్నానంటూ తెలిపారు. ఆనాటి వీడియో లింక్ ను కూడా ట్విట్టర్ లో షేర్ చేశారు ప్రధాని.
Viral Video:
ఇక సాక్షాత్తూ దేశ ప్రధానే స్పందించడంతో ఇక వీడియో షేర్ చేసిన వారిలోనూ, కామెంట్లు చేసిన వారిలో ఉత్సాహం పెరిగింది. వీడియో చేసిన వారు సైతం సంబరపడిపోయారు. తమ ప్రయత్నానికి ఈ తరహా ప్రోత్సాహం ఊహించలేదని ఆనందపడ్డారు.
Sanskrit and cricket pic.twitter.com/5fWmk9ZMZy
— LAKSHMI NARAYANA B.S (BHUVANAKOTE) (@chidsamskritam) October 2, 2022