Viral Video: సాధారణంగా పేషంట్లను అంబులెన్సుల్లో తరలిస్తుంటారు. ఏదైనా ప్రమాదానికి గురైనా కూడా వెంటనే వైద్య చికిత్స కోసం అంబులెన్సుల ద్వారా క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తుంటారు. ఇదంతా అందరికీ తెలిసిన విషయం. కానీ మధ్యప్రదేశ్ లో ఓ పేషెంట్ ను జేసీబీలో తీసుకురావడం వైరల్ అయింది. అంబులెన్సులో రావాల్సిన పేషంట్ జేసీబీలో రావడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఆ స్టోరీ ఏంటో మొత్తం తెలుసుకోండి.
మధ్యప్రదేశ్ లోని కట్నీలో ఓ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు గాయపడ్డాడు. యువకుడు బాధతో ఏడుస్తున్నాడు. సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే వెంటనే అక్కడ ఉన్న వారు అంబులెన్సుకు కాల్ చేశారు. కానీ అంబులెన్స్ రావడానికి ఆలస్యం అవడంతో ఓ వ్యక్తి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు.
ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తరలించేందుకు ఏకంగా తన జేసీబీనే వాడేశాడు ఓ వ్యక్తి. పుష్పేందర్ విశ్వకర్మ అనే వ్యక్తి గాయపడిన వ్యక్తి బాధ చూడలేక తన జేసీబీలో అతడిని వేసుకొని ఆస్పత్రికి తరలించడం జరిగింది. ఈ ఘటనపై స్పందించిన పుష్పేందర్ విశ్వకర్మ.. ‘యువకుడికి గాయాలై కాలు విరిగిందని.. అతడు కాలు నొప్పితో బాధపడుతున్నప్పటికీ.. అంబులెన్స్ సకాలంలో రాలేదు. రెండు, మూడు ఆటో రిక్షాలు అటు వైపు వచ్చినప్పటికీ.. వారు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు తిరస్కరించారు. దీంతో నేనే నా జేసీబీ సహాయంతో అలా ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది’ అని చెప్పాడు.
Viral Video:
కాగా సమయానికి అంబులెన్స్ రాకపోవడంతోనే జేసీబీలో పేషెంట్ ను తరలించాల్సి రాగా.. దీనిపై చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ స్పందించారు. చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ప్రదీప్ మాట్లాడుతూ..‘ రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించేందుకు 108 కు కాల్ చేశారు. అయితే, అక్కడికి అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతో ఇలా జేసీబీ బకెట్ లో తీసుకొచ్చారు. 108 సేవలు అందించే సంస్థ మారడంతో అంబులెన్స్ ని ఏర్పాటు చేయడంలో ఆలస్యమైంది. సమీపంలో ఉండే మరో పట్టణం నుంచే అంబులెన్స్ సేవలు అందిస్తాం.. అందువల్లే అంబులెన్స్ రాకలో జాప్యమైంది. కొత్త అంబులెన్స్ కోసం ప్రతిపాదనలు పంపించాం’ అని వివరించారు.
#WATCH | Madhya Pradesh: Accident victim in Katni taken to hospital in a JCB as the ambulance got late in arriving at the accident spot (13.09) pic.twitter.com/f2qcMvUmcV
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) September 14, 2022