Viral Video: ఎయిర్ పోర్టులో మన వాళ్లెవరైనా వెళుతున్నారంటే అక్కడికి వెళ్లి టాటా చెబుతాం. అలాగే మన వాళ్లు ఎవరైనా విమానంలో వస్తున్నారంటే వెళ్లి మామూలుగా అయితే పూలతో స్వాగతం పలుకుతుంటాం. అయితే ఒక వ్యక్తి తన మిత్రుడికి ఎయిర్ పోర్టులో స్వాగతం పలికిన విధానం అందరినీ షాక్ కు గురి చేసింది.
సదరు వ్యక్తి తన మిత్రుడికి స్వాగతం పలికిన విధానం చూసిన జనాలు.. ఇలా కూడా వెల్కమ్ చెబుతారా అని ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పెడితే.. బెస్ట్ వెల్కమ్ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇంతలా వెరైటీగా ఎలా వెల్కమ్ చెప్పారబ్బా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది పూర్తిగా చదవండి.
లండన్ లోని హీథ్రో ఎయిర్ పోర్టుకు ఒకతను వచ్చి తన స్నేహితుడి కోసం ఎదురుచూస్తున్నాడు. ఫ్లైట్ దిగిన తర్వాత అక్కడికి వచ్చిన తన పంజాబీ మిత్రుడి కోసం సదరు వ్యక్తి.. తనదైన బల్లే బల్లే స్టెప్పులతో ఎంతో స్టైల్ గా స్వాగతం పలికాడు. దీంతో ఎయిర్ పోర్టులోని వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఇలా కూడా వెల్కమ్ చేస్తారా అంటూ ఆశ్చర్యం వాళ్లనే అందరూ చూస్తూ ఉండిపోయారు.
Viral Video:
ఎయిర్ పోర్టులో జరిగిన ఈ సన్నివేశాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. నెటిజన్లు ఈ వీడియోను తెగ ఇష్టపడ్డారు. దాంతో ఇది వైరల్ అయింది. రోటీన్ గా ప్లకార్డ్ తోనే లేదంటే పూల బుకేతోనే వెల్కమ్ చెప్పడం మామూలే కానీ ఇలా స్టెప్పులేస్తూ చెప్పడం బాగా వెరైటీగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.