Viral Video: నేటి సోషల్ మీడియా యుగంలో ఏ చిన్న వింత జరిగినా, ప్రపంచమంతా వైరల్ అయిపోతోంది. అగ్గిపెట్టె, సబ్బు బిళ్ళ, కాదేది కవిత్వానికి అనర్హం అన్నట్టు ప్రతి చిన్న విషయం ప్రస్తుతం ఈ సోషల్ మీడియా యుగంలో యువర్స్ ను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వైరల్ వీడియోలను చూసేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. అటువంటి వైరల్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
మన ఇంట్లో పెంచుకునే పిల్లి, కుక్క, పక్షులు చేసే వింత వింత పనులు మనలను ఎంతో ఆహ్లాద పరుస్తాయి. ఈ మధ్యకాలంలో నెటిజన్లు తమ పెంపుడు జంతువులు చేసే పనులను కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలకు వ్యూయర్స్ నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. అలాంటి వీడియోనే ప్రస్తుతం జపాన్లో తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్లి కుండలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
జపాన్ కు చెందిన ఈ వీడియో ట్విట్టర్లో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. సదరు యూజర్ చమత్కారంగా ఈ వీడియోను Pawtery అని టైప్ చేశాడు. నిజానికి ఇంగ్లీషులో కుండలు చేయడాన్ని Pottery అంటారు. కానీ పిల్లి తన పంజాతో ని కుండలు చేస్తోంది, అందుకే ఆ అర్థం వచ్చేలా Pawtery అని ట్వీట్ చేశాడు.
Viral Video :
జపాన్లో మనుషుల కన్నా పిల్లులకే ఎక్కువ విలువ ఇస్తారు అనే పేరు ఉంది. ఈ వీడియో చూస్తుంటే అది నిజమే ఏమో అనిపిస్తుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ వీడియోను బుధవారం పోస్ట్ చేయగా ఇప్పటికే సుమారు మూడు మిలియన్ల మంది చూశారు. అలాగే 13000 మంది రిట్వీట్ చేశారు. దాంతోపాటు సుమారు 1,7,000 మంది లైక్ చేశారు.
Pawtery..😅 pic.twitter.com/XBillKpKEU
— Buitengebieden (@buitengebieden) September 21, 2022