Viral Video: సోషల్ మీడియాలో అన్నీ ఫన్నీ వీడియోలే వైరల్ అవుతుంటాయని ఏమీ లేదు. కొన్నిసార్లు మనల్ని భయపెట్టే వీడియోలు కూడా హల్ చల్ చేస్తుంటాయి. రోడ్డు యాక్సిడెంట్ వీడియోలు, జంతువులు మనుషులు మీద దాడి చేసే వీడియోలు లాంటివి కూడా నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో ఇలానే వైరల్ అవుతూ అందరినీ భయపెడుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఓ భారీ అనకొండ, కొండచిలువలు ఓ ఉడత కోసం పోటీ పడటం కనిపించింది. నిజానికి అనకొండ అంటేనే భారీ ఆకారంతో మనల్ని మింగేస్తుందేమో అన్నట్లు ఉండి, మనల్ని భయపెడుతూ ఉంటుంది. అలాగే కొండచిలువలు కూడా అంతే డేంజర్ గా ఉంటాయి. వీటిలో ఏది మన ముందుకు వచ్చినా మనం హడలిపోవాల్సిందే.
తాజాగా వైరల్ వీడియో ప్రకారం భారీ అనకొండ, కొండచిలువలు ఒకే దగ్గర ఉంటున్నాయి. బహుశా అవి జూ ఉన్నట్లు తెలుస్తోంది. అవి రెండూ బయటకు వెళ్లకుండా చుట్టూ ఇనుప తీగల వలను ఏర్పాటు చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇవి రెండూ పాకుకుంటూ ఓ టబ్ దగ్గరికి చేరుకుంటాయి. అయితే ఆ టబ్ మీద ఓ ఉడత ఉంది. ఆ ఉడత కోసం అనకొండ, కొండచిలువలు పోటీ పడ్డాయి.
Viral Video:
అనకొండతో పోటీపడలేని కొండచిలువ వెనక్కి తగ్గుతుంది. టబ్ వద్దకు వెళ్లిన అనకొండ ఉడతను అమాంతం మింగేసింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. రెప్టైల్ ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియో పోస్ట్ కాగా.. ఇది పాత వీడియోగా తెలుస్తోంది. కానీ ఇప్పటికీ ఇది వైరల్ అవుతుండటంతో నెటిజన్లు దీనిని తిరిగి షేర్ చేస్తున్నారు.