Viral Video: ఎక్కడి చూసిన దీపావళి సందడి నెలకొంది. లక్ష్మీపూజ పూర్తవ్వగానే అందరూ బాణాసంచాలు, టపాసులు కాలుస్తూ పండగను ఆనందంగా జరుపుకున్నారు. ఎక్కడ చూసిన కళ్లు మిరుమెట్లు గొలిపే వెలుగులతో ఆకాశం బాణాసంచా చిటపటలతో నిండిపోయింది. అయితే ఇలా ఆనందంగా దీపావళి జరుపుకుంటున్న వేళ పూణెలో చిన్న అపశృతి జరిగింది. పూణెలోని నార్హే ప్రాంతంలో టపాసులు కాలుస్తున్న ఓ చిన్నారికి గాయాలయ్యాయి. అక్కడ ఉన్నవారు ఈ సన్నివేశాన్ని వీడియో తియ్యడంతో దీనిని చూసిన వారంతా భయంకు గురయ్యారు. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
https://www.youtube.com/shorts/dsybycGg_Vo
పాపం పసివాడు ..
పట్టుమని పదేళ్లు కూడా లేని శివాంశ్ అమోల్ దల్వీ అనే చిన్నారి తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా దీపావళి వేడుకలు జరుపుకుంటున్నాడు. కుటుంబ సభ్యులు దగ్గరుండి టపాసులు కాల్పిస్తున్నారు. అయితే ఇంతలో ఏమయ్యిందో ఏమో తనే చిచ్చుబుడ్డి వెలిగించేందుకు ప్రయత్నించాడు. కుటుంబ సభ్యలు కూడా అడ్డు చెప్పకపోవడంతో చిచ్చుబుడ్డి వెలిగిస్తుండగా అది పేలి ఈ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.
సోమవారం రాత్రి 10 గంటలకు ఈ సంఘటన జరిగింది. బాలుడ్ని వెంటనే హాస్పటల్‌కు తీసుకొనివెళ్లి చికిత్స అందించారు. ఈ చిన్నారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. అయితే ఇంత జరిగిన తరువాత కూడా ఈ చిన్నారి మామయ్య మా పిల్లాడిలే ఎవరూ తమ పిల్లల్ని టపాసులు కాల్చే సమయంలో ఒంటరిగా వదిలేయ వద్దని విజ్ఞప్తి చేయడం గమనార్హం.
Viral Video:
అలాగే పూణేలోనే ఈ ఘటనతోపాటు ఇంకో 17 అగ్నిప్రమాదాలు జరిగాయి. సమాచారం అందుతున్న ఫైర్ సిబ్బంది వెంటనే సహాయకచర్యలు చేపట్టారు. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. యావత్మాల్ జిల్లాలో బాణాసంచా పేలడంతో మూడు దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. క్రాంతి చౌక్ పరిసర ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. పక్కనే ఉన్న కిరాణా షాపు, ఇన్సూరెన్స్ ఆఫీస్‌తో పాటు మరో దుకాణం తగలబడ్డాయి.