Viral Video: ఫేస్ బుక్, ఇన్ స్టా, యూట్యూబ్… మాధ్యమం ఏదైతేనేం.. రీల్స్ మాత్రం కామన్. సోషల్ మీడియా వేదికలన్నీ రీల్స్ చేసుకొనేందుకు సౌకర్యాలు కల్పించాయి. గతంలో టిక్ టాక్ ఉండేది. భారత్, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మన దేశంలో చైనాకు సంబంధించిన యాప్ లు, సోషల్ మీడియా వేదికలను చాలా వరకు కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ నేపథ్యంలో అప్పటికే ఉన్న యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లు టిక్ టాక్ స్థానాన్ని ఆక్రమించాయి.
ఇన్ స్టా ఓపెన్ చేస్తే చాలు.. రకరకాల వీడియోలు, రీల్స్ తో యువత, పెద్దలు కూడా అలరిస్తుంటారు. అయితే, ప్రత్యేకంగా రీల్స్ కోసమే ప్రాణాల మీదకు తెచ్చుకొనే స్టంట్లు కూడా చేస్తున్నారు కొందరు యువత. ఈ క్రమంలో చాలా తేలిగ్గా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో రీల్స్ చేస్తూ, కన్నవారికి, బంధువులకు తీవ్ర శోకం మిగిల్చేస్తున్నారు. తాజాగా వైరల్ అయిన ఈ వీడియోలో ఓ కుర్రాడు కదులుతున్న రైల్లో స్టంట్లు చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.పంజాబ్ లోని చావా రైల్వే స్టేషన్
ఈ మధ్య కాలంలో చాలా మంది రీల్స్ మోజులో పడి ఇలా ప్రాణాలు తీసుకుంటున్నారు. గతంలో టిక్ టాక్, సెల్ఫీ వీడియోలు తీసుకొని ఇలా ప్రాణాలు తీసుకొనే వారు.. ఇప్పుడు రీల్స్ పేరిట బలి అవుతున్నారు. ఇలాంటి ఘటనే పంజాబ్ రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంది. పరిధిలో జరిగిన ఈ ఘటన.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Viral Video:
వేగంగా ప్రయాణిస్తున్న రైల్లోంచి రీల్స్ కోసం యువకుడు ఆలోచించాడు. ఈ క్రమంలో రైలు ఫుట్ పాత్ వద్ద నిలబడి.. బయటికి వంగుతూ, వంకర్లు తిరుగుతూ పిచ్చి చేష్టలు చేయసాగాడు. వెనుక వైపు విండో సీట్ నుంచి మరో వ్యక్తి ఈ వీడియోను తీస్తున్నాడు. మధ్యలో అనేక కరెంట్ పోల్స్ తప్పించుకోగా, చివరగా ఓ స్తంభం ఢీకొని బంతిలాగా ఎగిరి కిందపడిపోయాడు. ప్రాణాలు కోల్పోయాడు.
Playing with life and death. A youth is performing stunt in a fast moving train. He paid with his life for this stunt. 😱🔞🤯#India #CrazyHorror pic.twitter.com/SOecJU8nXG
— Dr.GHAZAL 🦌 (@ghazal67) October 12, 2022