Viral Video: సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు జంతువులు చేసే ఫన్నీ విషయాల వల్ల, మరికొన్నిసార్లు అవి చేసే దాడుల వల్ల పాపులర్ అవుతుంటాయి. అయితే తాజాగా ఓ వీడియో చూసిన జనాలు మాత్రం అయ్యో.. పాపం అని అనుకుంటున్నారు. ఓ ఖడ్గమృగానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దాని వెనక ఉన్న కథేంటో తెలుసుకుందాం.
వైరల్ వీడియోలో కనిపించిన దృశ్యాల ప్రకారం ఓ ఖడ్గమృగం రోడ్డు దాటుతూ ట్రక్కును ఢీకొట్టింది. అస్సాంలోని హల్దిబారి అటవీ ప్రాంతంలో ఓ భారీ ఖడ్గమృగం అడవి లోపలి నుంచి పరుగెత్తుకుంటూ రోడ్డుపైకి వచ్చింది. అదే సమయంలో ఓ పెద్ద ట్రక్కు అటు వైపుగా వెళుతోంది. రోడ్డుపైకి దూసుకొచ్చిన ఆ ఖడ్గమృగం ఒక్కసారిగా ట్రక్కును ఢీ కొట్టింది. ఢీకొట్టిన తర్వాత కిందపడిపోయిన ఖడ్గమృగం.. లేచి కాసేపు పరుగెత్తి మళ్లీ కింద పడిపోయింది. ఆపై మళ్లీ లేచి అడవిలోకి పరుగెత్తింది.
ఈ వీడియోను అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో చర్చకు దారితీసింది. సదరు వీడియోను పోస్ట్ చేసిన సీఎం హిమంత బిశ్వశర్మ ఇలా రాసుకొచ్చారు.. ‘ఖడ్గమృగాలు మనుషులకు మంచి మిత్రులు. వాటికి హాని కలిగించే చర్యల్ని అస్సలు సహించబోము. హల్దిబారిలో జరిగిన ఈ ఘటన చాలా దురదృష్టకరం. వాహన డ్రైవర్‌కు జరిమానా విధించాం. వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా అసోంలోని కజిరంగ నేషనల్ పార్కు వద్ద 33 కిమీల మేర ప్రత్యేక ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటుపై పనిచేస్తున్నాము’ అని రాశారు.
Viral Video:
కాగా ఈ వీడియో చూసిన జనాలు.. అడవి గుండా మనం రోడ్లు వేసి, అడవి ప్రాణులకు రక్షణ లేకుండా చేశాం అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఖడ్గమృగం ప్రాణాలతో సేఫ్ గా బయట పడటం ఆనందంగా ఉందని చాలామంది కామెంట్ చేశారు.
Rhinos are our special friends; we’ll not allow any infringement on their space.
In this unfortunate incident at Haldibari the Rhino survived; vehicle intercepted & fined. Meanwhile in our resolve to save animals at Kaziranga we’re working on a special 32-km elevated corridor. pic.twitter.com/z2aOPKgHsx
— Himanta Biswa Sarma (@himantabiswa) October 9, 2022