Viral Pic: టాలీవుడ్ అందగాడిగా, ఒకప్పటి గ్రీకువీరుడిగా అక్కినేని నాగార్జున అందరికీ తెలుసు. అక్కినేని నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన నాగార్జున.. మంచి మంచి సినిమాలతో గుర్తింపు తెచ్చుకోవడం తెలిసిందే. ఇక నాగార్జున రెండు పెళ్లిళ్లు చేసుకోవడం, మొదటి భార్య దగ్గుబాటి వెంకటేష్ సోదరి అయిన లక్ష్మితో విడాకులు తీసుకొని అమలను పెళ్లి చేసుకోవడం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది.
సినిమా షూటింగ్ ల సమయంలో హీరోయిన్ అమలతో ప్రేమలోపడ్డ నాగార్జున.. లక్ష్మితో విడాకులు తీసుకుని అమలను పెళ్లి చేసుకున్నాడు. అలా దగ్గుబాటి, అక్కినేని కుటుంబాలకు కాస్త దూరం ఏర్పడింది. కానీ నాగచైతన్య మాత్రం దగ్గుబాటి కుటుంబంతో మంచి సంబంధాలను కలిగి ఉన్నాడు. నాగచైతన్య తల్లి లక్ష్మి చెన్నైలో నివసిస్తున్నారు. నాగచైతన్య పెళ్లి సమయంలోనే ఎక్కువగా బయటకు ఆమె వచ్చారు. మళ్లీ ఇంతవరకు ఆమెకు సంబంధించిన సమాచారం తెలీదు.
అయితే ప్రస్తుతం నాగార్జున దగ్గుబాటి లక్ష్మీల వివాహానికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వారి పెళ్లి సమయంలో నాగార్జున ప్రస్తుతం నాగచైతన్య కనిపిస్తున్నట్లుగానే ఉన్నాడు. అక్కినేని అభిమానులు ఈ ఫోటోను తెగ వైరల్ చేస్తున్నారు.లైక్ ఫాదర్.. లైక్ సన్ అని కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి నాగార్జున మొదటి పెళ్లి ఫోటో మాత్రం జనాలను బాగా ఆకర్షిస్తోంది.1984లో వీరు పెళ్లి జరుగగా 1990లో విడాకులు తీసుకున్నారు. 1992లో అమలను రెండో పెళ్లి చేసుకున్నాడు.
Viral Pic:
రీసెంట్ గా నాగార్జున ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ కాలేదు. కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. గత కొద్దిరోజులుగా నాగార్జున కెరీర్ డౌన్ లో ఉంది. ఆయన చేసిన ఏ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవడం లేదు.