Viral News : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎక్కడెక్కడి విషయాలు ఇట్టే తెలిసిపోతున్నాయి. కొన్ని వార్తలు భయం పుట్టిస్తే.. కొన్ని నవ్వు తెప్పిస్తాయి. మరికొన్ని మాత్రం అవాక్కయ్యేలా చేస్తాయి. అలాంటి ఘటనే ఇది. ఇటీవలి కాలంలో వారి ప్రేమ ఎల్లలు దాటింది అనే వార్తలు చూస్తూనే ఉన్నాం. అయితే ఎల్లలు దాటడమే కాదు కానీ వీరి ప్రేమ వయసును కూడా దాటేసింది. అంటే పెళ్లి విషయంలో యువతీ యువకుల మధ్య అంతరం మాక్సిమమ్ 10 – 15 ఏళ్లు కానీ వీరి ప్రేమ తగలెయ్య.. వీరి వయసుల మధ్య గ్యాప్ ఏకంగా 55 ఏళ్లు.
అవాక్కవుతున్నారా? మీరు చదువుతున్నది నిజమే. ఓ 83ఏళ్ల వృద్ధ మహిళ.. తన కంటే 55ఏళ్లు చిన్నవాడైన యువకుడిపై మనసు పడింది. అంతేకాదు.. ఏకంగా దేశం దాటొచ్చి మరీ అతడిని వివాహం చేసుకుంది. ఈ జంటకు వివాహమై ఏడాది అవుతోంది. ఈ సందర్భంగా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుని దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 83ఏళ్ల వయసు ఉన్న ఆ బామ్మ పేరు బ్రోమా. పోలాండ్‌కు చెందిన ఈమెకు.. పాకిస్థాన్‌కు చెందిన హఫీజ్ నదీమ్ అనే 28ఏళ్ల యువకుడితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడానికి పెద్దగా సమయం పట్టలేదు.
ఇద్దరూ గత ఏడాది నవంబర్ 1న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దీంతో ఈ ఏడాది నవంబర్ 1న ఘనంగా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా హఫీజ్ ఓ మీడియా సంస్థతో మాట్లాడాడు. ఆరేళ్ల క్రితం తొలిసారిగా బ్రోమాతో మాట్లాడానని చెప్పాడు. ఆసక్తికర విషయం ఏంటంటే.. పెళ్లికి ముందు తామిద్దరం ఒక్కసారంటే ఒక్కసారి కూడా కలుసుకోలేదని తెలిపాడు. వివాహ వేడుకలోనే తామిద్దరం మొదటి సారిగా ప్రత్యక్షంగా చూసుకున్నామని వెల్లడించాడు. అంతే కాదు.. బ్రోమా తమ సంప్రదాయాలను చక్కగా పాటించిందని హఫీజ్ చెప్పుకొచ్చాడు.