Viral Kid Video: సోషల్ మీడియాలో చాలా వరకు ఎంటర్టైన్మెంట్ అందించే వీడియోలు ఎక్కువగా షేర్ అవుతుంటాయి. అయితే కొన్ని వీడియోలు మాత్రం అలా ఎంటర్టైన్మెంట్ కాకుండా ఎమోషనల్ గా ఉంటాయి. వాటిని చూసిన నెటిజన్ల హృదయాలు ద్రవిస్తాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ చిన్నారి స్కూలుకు వెళ్లాల్సిన వయసులో పొట్ట కూటి కోసం చుడ్వా అమ్ముతున్న వీడియో అందరి హృదయాలను తాకింది. చిన్న వయసు అబ్బాయి భుజానికి ఒక డబ్బా తగిలించుకొని, అందులో పల్లీలు, బియ్యపు పాలాలు, నిమ్మకాయ, పలు రకాల ఆహార పదార్థాలను పెట్టుకున్నాడు. రోడ్డు మీద తిరుగుతూ చుడ్వా అమ్ముతున్నాడు.
ఆ కుర్రాడికి సంబంధించిన వీిడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పుస్తకాలు పట్టుకోవాల్సిన వయసులో ఇలా చుడ్వా అమ్మడం అందరి హృదయాలను తట్టింది. చిన్నారి వీడియోలను ఒకతను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ‘చదువుకోవడానికి లేదా సంపాదించడానికి, మనసు నిర్ణయించేది కడుపు కాదు’ అని రాసుకొచ్చాడు.
Viral Kid Video:
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకు ఇప్పటి వరకు 19వేలకు పైగా వ్యూస్ రాగా.. నెటిజన్ల నుండి మంచి స్పందన వస్తోంది. ఇంత చిన్న వయసులో ఎన్ని బాధ్యతలో అని కొందరు, చుడ్వా డబ్బా కాదు, స్కూల్ బ్యాగ్ పట్టుకోవాలని కొందరు కామెంట్లు చేప్తున్నారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో ఎంతోమంది హృదయాలను కరిగించేస్తోంది.
पढ़ा जाए या कमाया जाए,
ये दिमाग़ नहीं पेट तय करता है।~ अम्बष्ठ pic.twitter.com/Yn5fCdGyJD
— उम्दा_पंक्तियां (@umda_panktiyan) September 30, 2022