Viral Kid Video: నవ్వడం ఒక వరం.. నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు పెద్దలు. మనం రోజూ మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల శరీరంలోని అనేక కండరాలు కదలిక ఏర్పడి ఆరోగ్యం మన సొంతమవుతుందని వైద్య నిపుణులు, మానసిక శాస్త్రవేత్తలు చెబుతుంటారు. నిత్య జీవితంలో అనేక మంది నవ్వుకొనే అవకాశం లేక ఇబ్బందులు పడుతుంటారు.
ఈ వీడియోలో ఓ పిల్లవాడు చక్కగా నవ్వుతున్నాడు. మిమ్మల్ని కూడా నవ్వమని కోరతాడు. ఈ పిల్లాడిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. లైకులు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. బుడ్డోడి యాక్షన్ కు అందరూ ఫిదా అవుతున్నారు. నెటిజన్లు హౌ క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. పలువురిని విపరీతంగా ఆకట్టుకుంటోంది ఈ వీడియో.
పిల్లాడు నవ్వుతూ, అతడిని కూడా నవ్వమని చెబుతాడు. చిన్నారి హావభావాలు ఇచ్చే తీరు ఆకర్షణీయంగా ఉన్నాయి. దీన్ని తీసుకెళ్లి ఇన్ స్టా రీల్స్ లో పెట్టారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. పిల్లాడి నవ్యు సూపర్.. క్యూట్ అంటూ పలువురు వ్యాఖ్యలు జోడిస్తున్నారు.
Viral Kid Video: 18 లక్షలకు పైగా వ్యూస్.. ఇంకా కంటిన్యూ..
ఈనెల 1న ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి ఇప్పటికే సుమారు 18 లక్షలకు పైగా వ్యూస్ వచ్చేశాయి. ఇప్పటికి ఎన్ని సార్లు చూశానో లెక్కే లేదని ఓ యూసర్ కామెంట్ పెట్టాడు. బుడ్డోడి స్మైల్ చూశాక కడుపు నిండిపోయిందంటూ చెబుతున్నారు కొందరు. నేటి ఉరుకులు పరుగుల జీవితంలో నవ్వడం ఎంత ముఖ్యమో ఈ వీడియో చెబుతోంది. నవ్వడం కొన్ని అనారోగ్య సమస్యలనూ దూరం చేస్తుంది. ఒత్తిడిని చిత్తు చేయడానికి బెస్ట్ మెడిసన్ నవ్వే. చిన్న పిల్లల చేష్టలు కొన్ని చాలా మందికి నవ్వు తెప్పిస్తాయి. వారి క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో మనల్ని మెప్పిస్తుంటారు.