Vikram : ప్రయోగాత్మకమైన చిత్రాలకు చియాన్ విక్రమ్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటారు. ప్రతి చిత్రంలోనూ విభిన్నమైన పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. విక్రమ్ తాజాగా నటించిన చిత్రం ‘కోబ్రా’. ఇది కూడా ఒక ప్రయోగాత్మకమైన సినిమాయే. దాదాపు మూడేళ్ల తర్వాత థియేటర్స్‌లో ఈ సినిమా సందడి చేసింది. అందుకే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో విక్రమ్ ఒక మ్యాథ్స్ జీనియస్. ఆయన పోలీసులకు దొరక్కుండా తెలివిగా కొంతమందిని చంపుతూ ఉంటాడు. కానీ ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా చేసిన క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఒక చిన్న ఆధారంతో ఈ హత్యల వెనుక ఎవరున్నారనే విషయం మీద కూపీ లాగటానికి.. విక్రమ్ ఉండే చెన్నైకు ఇర్ఫాన్ వస్తాడు.
మరో పక్క వ్యాపారవేత్తగా నటించిన రోషన్ మాథ్యూని కూడా విక్రమ్ టార్గెట్ చేస్తాడు. అసలు విక్రమ్ ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడు..? అసతతను ఒక్కడేనా? లేక అతనితో ఇంకెవరైనా వుంటారా? అనేది ఆసక్తికర విషయం. నిన్న వినాయకచవితి కానుకగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో విక్రమ్ 10 గెటప్స్‌లో కనిపించాడు. అందుకోసం విక్రమ్ చలా శ్రమించాల్సి వచ్చిందట. దీని కోసం నిర్మాత పెద్ద మొత్తంలో విక్రమ్‌కు చెల్లించాడని టాక్. విక్రమ్ రెమ్యూనరేషన్ విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
Vikram : బడ్జెట్‌లో దాదాపుగా 22 శాతం
‘కోబ్రా’లో నటించడానికి విక్రమ్ భారీ మొత్తంలో పారితోషికాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం కోబ్రా సినిమాకు విక్రమ్ దాదాపు రూ.25 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ను తీసుకున్నాడట. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ రెమ్యూనరేషన్ సినిమా బడ్జెట్‌లో దాదాపుగా 22 శాతమని తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు.సెవెన్ స్టూడియోస్ – రెడ్ జెయింట్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ‘కేజీఎఫ్’భామ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం తెలుగులో ఎన్వీ ప్రసాద్ ఎన్వీఆర్ సినిమా ద్వారా విడుదలౌతుంది.