Vijayasai Reddy : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చిక్కుల్లో పడ్డారు.
వైసీపీ నిర్వహించిన మెగా జాబ్ మేళాకి సంబంధించి ఆయన ఇబ్బందుల్లో పడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు వైసీపీ పార్టీ తరపున రాష్ట్రంలో మెగా జాబ్ మేళాలు గతంలో నిర్వహించారు. విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలోనే ఈ మెగా జాబ్ మేళాలు జరిగాయి. విశాఖపట్నంతో పాటు గుంటూరు, తిరుపతి సిటీల్లో ఈ మెగా జాబ్ మేళాలు వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో జరిగాయి.
ఈ మెగా జాబ్ మేళాలో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పాల్గొన్నాయని వైసీపీ ప్రచారం చేసింది. కానీ సెక్యూటీ ఉద్యోగాలు, చిన్న సాప్ట్ వేర్ ఉద్యోగాలు, ఫ్యాక్టరీల్లో హెల్పర్ల ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సాప్ట్ వేర్ ఉద్యోగాలన్నీ అన్నీ ఫేక్ అని, మంచి ఉద్యోగాలు అన్ని చెప్పి మోసం చేశారంటూ చాలాచోట్ల కేసులు నమోదయ్యాయి. విశాఖలో నిర్వహించిన జాబ్ మేళాలో విజయసాయిడ్డి పాల్గొని ఉద్యోగాలు పొందిన వారికి నియమాక పత్రాలు అందించారు.
కానీ ఆ కంపెనీ రూ.30 వేలు డిపాజిట్ చేయాలని కండీషన్ పెట్టిందటట. కొంతమంది డబ్బులు కట్టి చేరగా.. ట్రైనింగ్ ఇస్తామని చెప్పి ఆ కంపెనీ పట్టించుకోలేదు. తర్వాత జీతాలు కూడా ఇవ్వలేదు. ట్రైనింగ్ , ఉద్యోగం తమకు వద్దని, తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. దీంతో తాము ఇవ్వమని, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బాధితులను బెదిరించారు. దీంతో బాధితులు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Vijayasai Reddy :
విజయసాయిరెడ్డి నిర్వహించిన జాబ్ మేళాలోనే మోసాలు బయటపడ్డాయి. ఇప్పుడు వైసీపీ జాబ్ మేళాలో ఒక కంపెనీ దొరకడంతో మిగతా కంపెనీలు కూడా బోగన్ నా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో విజయసాయిరెడ్డి చిక్కుల్లో పడినట్లు అయింది. విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరగడంతో ఆయన ఇబ్బందుల్ల పడ్డారు. నిరుద్యోుగులు విజయసాయిరరెకడ్డిపై మండిపడుతు్నారు. ఇలా ఫేక్ జాబ్ లు ఇప్పించడం ఏంటని విజయసాయిరెడ్డిపై బాధితులు మండిపడుతున్నారు.