సౌత్ ఇండియా స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కేవలం హీరోగానే చేస్తానని కూర్చోకుండా, మంచి పాత్రలు ఎక్కడ ఉన్నా అతన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. విజయ్ కూడా అలాగే అవకాశాన్ని బట్టి తన క్యారెక్టర్ కి మంచి స్కోప్ ఉంటుంది అంటే విలన్ పాత్రలలో కనిపించడానికి కూడా రెడీ అయిపోతున్నాడు. ఇప్పటికే తెలుగులో ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా తండ్రిగా పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించి మెప్పించాడు. అలాగే విజయ్ మాస్టర్ మూవీలో కూడా సేతుపతి సత్తా చాటాడు. అందులో హీరోతో సమానంగా విజయ్ సేతుపతి పాత్ర కూడా ఉంటుంది.
ఇక ఇప్పుడు బాలీవుడ్ మూవీ సుల్తాన్ లో విలన్ పాత్రలో మెప్పించడానికి విజయ్ సేతుపతి రెడీ అయిపోయాడు. షారుక్ ఖాన్, అత్లీ కాంబినేషన్ లో ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాని అత్లీ ఆవిష్కరిస్తున్నారు ఇక ఇందులో మొదటి సారిగా సౌత్ ఇండియా విమెన్ సూపర్ స్టార్ నయనతార బాలీవుడ్ స్క్రీన్ కి పరిచయం అవుతుంది.. ఈ సినిమా మీద భారీ అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం విజయ్ సేతుపతి తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ సినిమా కోసం సేతుపతి ఏకంగా 21 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడు అని టాక్. ఇప్పటి వరకు విలన్ పాత్రలు చేసిన ఎ ఒక్కరు ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఓ విధంగా చెప్పాలంటే హీరోగానే విజయ్ సేతుపతి 15 నుంచి 20 కోట్ల మధ్య తీసుకునేవాడు. అలాంటిది సుల్తాన్ కోసం అత్లీ ఏకంగా 21 కోట్లు ఇచ్చాడని టాక్ నడుస్తుంది. నిజంగా ఇది నిజమైతే ఇండియన్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే విలన్ గా విజయ్ సేతుపతి నిలిచిపోతాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు.