మెగా పవర్ స్టార్ రామ్ చరణ్–డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఇటీవల చరణ్ తండ్రి కావడంతో.. ఈ సినిమా షూటింగ్ నుంచి కాస్త విరామం తీసుకున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మెుదలుకానుంది.

ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా వస్తుంది. ఇందులో శ్రీకాంత్, సునీల్, అంజలి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది.ఈ మూవీ తర్వాత డైరక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోకు సంబంధించి గతంలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ఫ్రీ పొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనుంది. ఇందులో చరణ్ పాత్ర చాలా పవర్ పుల్ గా ఉండనుంది. అయితే ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ కోసం తమిళ్ స్టార్ విజయ్ సేతుపతిని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు-విజయ్ కలయికలో వచ్చిన ఉప్పెన ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. రామ్ చరణ్ సినిమాలో విజయ్ రోల్ విలన్ గా కాదు.. కథను మలుపుతిప్పే పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది.