Vijay – Rashmika: సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్లు కాస్త సన్నిహితంగా కనిపిస్తే చాలు వారి మధ్య ఏదో ఉందని పుకార్లు వస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఇలాంటి ప్రేమ పుకార్లు ఎక్కువగానే వినపడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ పుకార్లు ఇంకా పెరిగాయి. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకడిగా ఉన్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్లి జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.
దీనితోపాటు వీరిద్దరి పెళ్లి ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.విజయ్ తన సినిమా కెరియర్ మొదట్లో గీతాగోవిందం,డియర్ కామ్రేడ్ సినిమాలో రష్మిక తో కలిసి నటించాడు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని తెలుగు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. విజయ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.
రష్మిక మందన కన్నడ సినిమా కిరాక్ పార్టీ సినీమా తో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత చలో సినిమా చేసిన రష్మిక అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. రష్మిక మందన ప్రస్తుతం దక్షిణాది సినిమాలో కాకుండా బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. విజయ మాత్రం ఖుషి సినిమాలో నటిస్తున్నాడు.
రష్మిక మందన్నా సినిమా కెరీర్‌ను మొదలు పెట్టిన రోజులలో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడి, అతడితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ ఈ జంట ఏవో మనస్పార్ధాలు వచ్చి నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు. ఇక, తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రష్మిక రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తునే ఉన్నాయి.
Vijay – Rashmika: విజయ్ రష్మిక వివాహం నిజంగానే జరిగిందా..
కొద్ది రోజుల క్రితమే విజయ్, రష్మిక మాల్దీవులు టూర్ వెళ్లి వచ్చారు. అలాగే, తాజాగా మరోసారి జంటగా అక్కడికి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం వీళ్లిద్దరూ ఎయిర్‌పోర్టులో కనిపించడమే అని తెలుస్తోంది. మార్ఫింగ్ టెక్నాలజీతో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు విజయ్, రష్మిక ల పెళ్లి జరిగినట్లు ఒక ఫోటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది గమనించిన కొంతమంది వీరు నిజంగానే పెళ్లి చేసుకున్నారా అని అనుకుంటున్నారు.