లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ప్రముఖ నటుడు తళపతి విజయ్ నటించిన లియో మూవీ విడుదల కాకుండానే దుమ్ము రేపుతోంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతంలో మూవీ మేకర్స్ విడుదల చేసిన నా రెడీ సాంగ్(Naa Ready Song) షేక్ చేస్తోంది. భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి. విజయ్ మాస్ అప్పీల్ మరోసారి లియోలో కనిపించేలా చేశాడు లోకేష్ కనగరాజ్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు డైరెక్టర్. ఇక డ్యాన్సులతో హోరెత్తించే తళపతి విజయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

మరోసారి తన సత్తా ఏమిటో చూపించాడు. ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. తన పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేస్తిన ఫస్ట్ లుక్ కిర్రాక్ తెప్పించేలా చేసింది. లైకులు, కామెంట్లతో హోరెత్తి పోతోంది. మాస్ సిగ్నేచర్ స్టెప్పులకు అభిమానులు ఫిదా అవుతున్నారు. బొమ్మ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని అంటున్నారు. తళపతి నువ్వే మాకు అధిపతి అంటూ నినదిస్తున్నారు. ఇక మినిమం గ్యారెంటీ ఉన్న దర్శకుడిగా పేరు పొందారు లోకేష్ కనగరాజ్. ఇక విజయ్ మ్యాక్సిమమ్ గ్యారెంటీ హీరో.
దక్షిణాదిలో అత్యధిక పారితోషకం అందుకునే నటుడిగా ఇప్పటికే పేరుంది. ఇందులో బాలీవుడ్ లో దిగ్గజ నటుడిగా పేరు పొందిన సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తుండడం సినిమాకు హైలెట్ అని చెప్పక తప్పదు. మొత్తంగా విజయ్ ఊర మాస్ స్టెప్పులు నిద్ర లేకుండా చేస్తున్నాయి..