శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘ఖుషి’ అనే సినిమాలో నటిస్తోన్నాడు. ఇందులో సమంత రూత్ ప్రభు హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయింది. కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌తో పాటు పాటను విడుదల చేశారు. వీటికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి. దీంతో ఈ మూవీ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. ఇక, తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ న్యూస్ లీకైంది.

తాజా సంచలనం ఏమిటంటే, ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. అయితే, మేకర్స్ లేదా OTT సర్వీస్ ఇంకా ధృవీకరించలేదు.
‘ఖుషి’ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య తదితరులు కీలక పాత్రలను చేస్తున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 1న విడుదల చేస్తున్నారు.