Vijay Devarakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ.ఈయన వరుస సినిమాలలో నటిస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకోవడంతో ఏకంగా ఈయనకు పాన్ ఇండియా స్థాయిలో నటించే అవకాశం లభించింది.
ఇలా పాన్ ఇండియా స్థాయిలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.అయితే ఈ సినిమా విడుదలకు ముందు విజయ్ దేవరకొండ గురించి ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా వేణు స్వామి మాట్లాడుతూ విజయ్ దేవరకొండ కెరియర్ పెద్దగా బాలేదని ఆయనకు వరుస ప్లాప్స్ వస్తాయంటూ గతంలో ఈయన జాతకం గురించి తెలిపారు.
ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ విషయంలో వేణు స్వామి చెప్పిన మాటలు లైగర్ సినిమా ద్వారా నిజమయ్యాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వేణు స్వామి చెప్పిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.గతంలో ఈయన విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ విజయ్ దేవరకొండ జాతకం బాగాలేదని ఆయన జాతకంలో అష్టమ శని నడుస్తుందని తెలిపారు.
Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు సినీ కెరియర్ కష్టమే…
ఈ శని ప్రభావం విజయ్ దేవరకొండ కెరియర్ పై మరి కొద్ది రోజులు ప్రభావం చూపుతోందని అంతవరకు ఈయనకు పెద్దగా ఇండస్ట్రీలో కలిసి రాదంటూ చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలు విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు ముందు చేశారు. ఇక మరో రెండు మూడు సినిమాలు ద్వారా ఈయనకు సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ అనంతరం ఇండస్ట్రీలో ముందుకు సాగడం కష్టతరమవుతుందని ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలకు పోటీగా ఈయన ఇండస్ట్రీలో కొనసాగలేరంటూ ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు.