Vijay Devarakonda : లైగర్ హిట్ కొడితే పాన్ ఇండియా లెవెల్ లో తన సత్తా ఏమిటో చూపిద్దామని ఫిక్స్ అయ్యాడు విజయ్ దేవరకొండ. అయితే ఈ బొమ్మ బాక్స్ ఆఫీస్ వద్ద అడ్డం తిరగడంతో రౌడీ బాయ్ ఆశలన్నీ ఆవిరి అయ్యాయి. పూరీ సినిమా భారీ ఫ్లాప్ ని మిగాల్చడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు విజయ్. జనగణమనకు బ్రేక్ వేసి ప్రస్తుతం సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.

ఖుషి తర్వాత వాట్ నెక్స్ట్ అన్న క్వశ్చన్ ఇప్పుడు దేవరకొండ ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. మహానటి సినిమా లో సార్ దేవరకొండ కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయిందని, ఖుషి కూడా పవన్ కళ్యాణ్ సినిమా పేరు కావడంతో హిట్ అందుకుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తే విజయ్ సక్సెస్ గ్రాఫ్ మళ్లీ పెరుగుతుందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఆ మధ్యన దిల్ రాజు ఓ కథ రెడీ చేసుకున్నాడని దానికి విజయ్ హీరోగా ఫిక్స్ అయ్యాడు అన్న టాక్ వచ్చింది . కానీ దానిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో సమంత ఒక స్టెప్పు ముందు వేసి తన డైరెక్టర్లతో దేవరకొండను డైరెక్ట్ చేయమని రికమండేషన్ చేస్తుందని గాసిప్స్ గుప్పుమంటున్నాయి. తాజాగా దేవరకొండకు భారీ ఆఫర్ తలుపు తట్టిందని ఇండస్ట్రీ టాక్. సమంతను డైరెక్ట్ చేసిన డైరెక్టర్లే విజయ్ ని డైరెక్ట్ చేయబోతున్నారట.

Vijay Devarakonda : సినిమాలకు పోటీగా ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ భారీ ప్రేక్షక ఆదరణను రాబట్టింది. ఇదే స్ఫూర్తితో ఫ్యామిలీ మెంటు కూడా డైరెక్ట్ చేశారు రాజ్ నిడిమోర్ అండ్ కృష్ణ దాసరి కొత్తపల్లి. ఫ్యామిలీ మెన్ 2 లో సమంత తన వైవిధ్యమైన నటనతో విమర్శకుల ప్రశంసలను సైతం పొందింది. ఇప్పుడు ఈ ఇద్దరు డైరెక్టర్లు విజయ్ దేవరకొండ తో సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగు వారైనా ఇద్దరు డైరెక్టర్లు చాలా కాలంగా తెలుగు హీరోలతో సినిమా చేయాలనుకుంటున్నారట. మహేష్ తో మూవీ ప్లాన్ చేద్దామనుకున్నా అది వర్కౌట్ కాలేదట. తాజాగా విజయ్ దేవరకొండ తో వీరి సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. దీనంతటికీ సమంతానే కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ ఇద్దరితో పాటే వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ మూడోసారి విజయ్ ను డైరెక్ట్ చేయనున్నాడట. ఆల్రెడీ అగ్రిమెంట్ మీద సైన్ అయినప్పటికీ మంచి కథ సెట్ కావడంతో వీరి ప్రాజెక్ట్ కాస్త ఆలస్యం అవుతుందట .