Vijay Devarakonda : కాఫీ విత్ కరణ్ షోలో ఇటీవలి కాలంలో టాలీవుడ్ స్టార్స్ మెరుస్తున్నారు. ఈ కార్యక్రమం నేషనల్ వైడ్‌గా మంచి హిట్ అవడంతో ఈ ప్రోగ్రాంకు వెళ్లేందుకు స్టార్స్ సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హోస్టింగ్ ఈ షోకే హైలైట్‌గా నిలుస్తోంది. మొదట్లో టీవీలో మాత్రమే ప్రసారమయ్యే ఈ షో ఇప్పుడు కేవలం ఓటీటీలోనే అందుబాటులో ఉంది. కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ షోలో కరణ్ అడిగే ప్రశ్నలు సైతం ఆసక్తికరంగానే ఉండటంతో పాటు సెలబ్రిటీలను కాస్త ఇబ్బందికి గురి చేసే విధంగా ఉండటంతో ఈ షోకి మరింత ఆదరణ పెరిగింది. కరణ్ అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పలేక స్టార్స్ సైతం కళ్లు తేలేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
Vijay Devarakonda : ఆ రోజు సమాధానం చెబుతా..
ఇబ్బంది పెట్టను అంటూనే కరణ్ నటీనటులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంటారు. ఇక ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా కూడా ఈ షో అదుర్స్. ఇటీవల ఈ షోలో మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాల్గొని సందడి చేశాడు. మన రౌడీ హీరోను సైతం కరణ్ వదల్లేదు. కొన్ని అభ్యంతరకర ప్రశ్నలు అడిగి అతడిని ఇబ్బంది పెట్టాడు. అంతేకాదు, అతడి లవ్ లైఫ్ గురించి కూడా ఆరా తీసినట్టు ప్రోమోను బట్టి తెలుస్తోంది. ఎవరితోనైనా లవ్‌లో ఉన్నావా? అని విజయ్‌ను కరణ్ ప్రశ్నించారు. అయితే దీనికి తాను ఇప్పుడే సమాధానం చెప్పబోనని విజయ్ చెప్పాడు. తాను పెళ్లి చేసుకుని, పిల్లాపాపలతో సంతోషంగా ఉన్న రోజు దీనికి సమాధానం చెబుతానన్నాడు. దీనికి కారణాన్ని కూడా మన యంగ్ హీరో వివరించాడు.
తన ప్రేమ విషయంలో నోరు విప్పి ఎవరినీ ఇబ్బంది పెట్టదలుచుకోలేదన్నాడు. ఎందుకంటే చాలామంది నటుడిగా తనను ఎంతగానో ప్రేమిస్తారని తెలిపాడు. గోడలపై తన పోస్టర్లు అతికిస్తారని.. అలాగే ఫోన్ వాల్‌పేపర్ మీద కూడా తన ఫొటోనే ఉంటుందన్నాడు. తనను అంతలా ప్రేమించి ఆదరిస్తారని చెప్పుకొచ్చాడు.. అలాంటిది తన ప్రేమ గురించి చెప్పి వారి మనసు ముక్కలు చేయలేనని విజయ్ బదులిచ్చాడు. కాగా విజయ్, రష్మిక మందన్నాతో ప్రేమలో ఉన్నాడంటూ కొన్నేళ్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై అటు రౌడీ హీరో, ఇటు రష్మిక ఇద్దరూ కూడా స్పందించారు. తాము మంచి స్నేహితులం మాత్రమేనని, తమ మధ్యలో ఏదీలేదని స్పష్టం చేశారు. అయినా కూడా కొందరు మాత్రం ఇప్పటికీ వారు ప్రేమికులేనని బలంగా నమ్ముతున్నారు.