రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు. ఆగష్టు 25న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వలో బ్యాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఈ సినిమాని పూరి అండ్ కో, విజయ్ దేవరకొండ ఫుల్ ప్రమోషన్ చేస్తున్నారు. నార్త్ ఇండియా మొత్తం తిరిగేసి ప్రమోషన్ లో పాల్గొన్న విజయ్ దేవరకొండ పూరి టీమ్ ఇప్పుడు సౌత్ ల ప్రమోషన్ లో బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే నిన్నటి నుంచి ట్విట్టర్ లో బాయ్ కట్ లైగర్ అనే హ్యాష్ ట్యాగ్ తో నెగిటివ్ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. జర్నలిస్టులకి గౌరవం ఇవ్వలేదని, అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ వారసత్వ హీరోయిన్ అనన్యా పాండే హీరోయిన్ గా ఉందని, అలాగే కరణ్ జోహార్ నిర్మాతగా ఉన్నాడని కారణాలు చూపిస్తూ సినిమాపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఇక సౌత్ ఆధిపత్యాన్ని సహించలేని కొంత మంది దీనికి ఆజ్యం పోస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నెగిటివ్ ట్రెండ్ పై విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో రెస్పాండ్ అయ్యాడు.
బాయ్ కట్ ప్రచారం చేసుకోవాలని అనుకుంటే చేసుకోండి. ఎవరు తగ్గేదిలే. కొట్లాటకి దిగితే కొట్లాడుడే. ఎవరు భయపడేది లేదు. సినిమా నచ్చిన వాళ్ళు థియేటర్స్ లో చూస్తారు.లేదంటే ఓటీటీకి వచ్చాక చూస్తారు. ఏదో చేస్తే ఏదో జరిగిపోతుంది అనే భయం ఇక్కడ ఎవరికీ లేదు అని మీడియా ముఖంగా క్లారిటీ ఇచ్చాడు. అలాగే బాయ్ కట్ లైగర్ కి పోటీగా రౌడీ స్టార్ ఫాన్స్ ని ఐ సపోర్ట్ లైగర్ అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ చేస్తున్నారు. ఇక సౌత్ ఆడియన్స్ ఈ ట్యాగ్ కి సపోర్ట్ గా పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ ట్రెండింగ్ ఎవరు గెలుస్తారు అనేది చూడాలి.