పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే జంటగా నటిస్తున్న మూవీ లైగర్ పూరీ కనెక్ట్స్,ధర్మ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ యుఎస్ షెడ్యూల్ తాజాగా పూర్తయింది.దాదాపు పూర్తి అయిపోవచ్చిన ఈ మూవీ టీజర్ ను సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లాన్ లో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం.
మహేష్ బాబు సర్కారు వారి పాట మూవీ అనౌన్స్ చేసిన ఏప్రిల్ 1వ తేదీనే ఈ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రావాలనే ప్లాన్ లో ఉందట.ఈ మూవీతో బాలీవుడ్ లో తనకు గ్రాండ్ డెబ్యూ దొరుకుతుందని విజయ దేవరకొండ ఆశిస్తున్నారు మరి ఆ ఆశ నెరవేరుతుందో లేదో వేచి చూడాలి.