Vijay Devarakonda : విజయ్ దేవరకొండ స్టార్ ఇమేజ్ లైగర్ తో ఒక్కసారిగా తలకిందులయ్యింది. పూరీ జగన్నాద్ దర్శకత్వంలో గత నెలలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. కనీస వసూళ్లు కూడా రాబట్టలేక నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగిల్చింది. పూరీతో పాన్ ఇండియా సినిమా చేస్తే తన క్రేజ్ దేశవ్యాప్తంగా పెరుగుతుందని కలలు కన్న విజయ్ కు చేదు అనుభవమే ఎదురైంది. లైగర్ ఫ్లాప్ కావడంతో సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండపై నెగెటివ్ ట్రోలింగ్ జరిగింది.

Vijay Devarakonda : ఇదిలా ఉంటే లైగర్ షూటింగ్ సమయంలోనే పూరీతో జనగణమన చేసేందుకు కమిట్ అయ్యడు విజయ్. కొంత వరకు షూడింగ్ కూడా పూర్తి అయ్యింది. అయితే లైగర్ ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేక పోవడంతో ఇప్పుడు జనగణమన గురించిన అప్‌డేట్స్‌ను నిర్మాతలు బయటపెట్టడం లేదు. అయితే తాజాగా విజయ్ ఈ మూవీపై సైమా వేదికగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. మీడియా జనగణమన గురించి అడిగిన ప్రశ్నకి ఇలాంటి సంతోషకర సమయంలో ఆ విషయం గురించి ఎందుకండీ మరిచిపోండంటూ సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం విజయ్ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కామెంట్స్ పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇక జనగణమనకు బ్రేక్ పడినట్లేనా అని కామెంట్స్ చేస్తున్నారు.

Vijay Devarakonda : జనగణమన దర్శకుడు పూరీ జగన్నాథ్ కలల ప్రాజెక్టు. మొదటి ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్‌బాబుతో తీయాలనుకున్నారు. ఆరేళ్ల క్రితమే స్క్రిప్ట్‌తో ఆయన్ను కలిశారు. అయితే మహేష్‌తో వర్కౌట్ కాకపోవడంతో విజయ్‌ను ఈ ప్రాజెక్ట్ కోసం సెలక్ట్ చేసుకున్నాడు పూరీ. లైగర్ షూటింగ్ పూర్తి కాగానే కొద్ది పార్ట్‌ను షూట్ కూడా చేశారు. ఈ మూవీలో విజయ్ దేవరకొండకు జోడీగా పూజా హెగ్దేను కన్ఫార్మ్ చేశారు. అంతా బాగుందని అనుకునే లోపే లైగర్ ఫ్లాప్‌తో ఈ సినిమాకు బ్రేకులు పడినట్లు లోలోపల గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా విజయ్ కామెంట్స్ కూడా ఈ పుకారుకు బలాన్ని అందిస్తున్నాయి. మరి ఈ ప్రాజెకట్టు పట్టాలెక్కాలన్నా, పుకార్లకు బ్రేక్ పడాలన్నా పూరీ కనెక్ట్స్ ఒకసారి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యి కన్ఫార్మ్ చేయాల్సిందే.