Vijay Devarakonda : టైటిల్ చూడగానే ఒకింత ఆశ్చర్యమేస్తోంది కదా. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు గాయం నుంచి కోలుకోవడమేంటి? అసలు తనెప్పుడు గాయపడ్డాడు? అని. ఇప్పుడు కాదులెండి.. సినిమాల్లోకి రావడానికి ముందే విజయ్ గాయపడ్డాడట. ఇటీవలి కాలం అంటే 8 నెలల క్రితం అది తిరగబెట్టింది. తిరిగి చికిత్స తీసుకుని దాని నుంచి కోలుకున్నట్టు విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. తన ఆరోగ్యంపై మన రౌడీ హీరో కీలక అప్‌డేట్ ఇచ్చాడు.
విజయ్‌కు సినిమాల్లోకి రావడానికి ముందే భుజానికి గాయం అయ్యింది. ఆ నొప్పిని భరిస్తూనే లైగర్ షూటింగ్‌తో పాటు చిత్ర ప్రమోషన్స్‌ను సైతం నిర్వహించాడు. తాజాగా రౌడీ హీరో తనకు సంబంధించిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. తన గాయం నుంచి చికిత్స అనంతరం ఇప్పుడు పూర్తిగా కోలుకుంటున్నట్టు వెల్లడించాడు. ఇన్‌స్టా స్టోరీలో ఒక ఫోటోను షేర్ చేసిన విజయ్ దేవరకొండ.. బీస్ట్ బయటకు రావాలని ఆతృతపడుతోందని… అది ఇంతకాలం పంజరంలోనే ఉండిపోయిందని పోస్ట్ పెట్టాడు.
నిజానికి విజయ్ దేవరకొండ భుజానికి సినిమాల్లోకి రాకముందే గాయమైందట. అది తిరిగి బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన లైగర్ షూటింగ్ సమయంలో తిరగబెట్టిందని తెలుస్తోంది. విజయ్‌కు షోల్డర్ ఇంజ్యురీ అయ్యిందట. లైగర్ షూటింగ్ సమయంలో ఆ గాయం మళ్లీ తిరిగబెట్టిందని సమాచారం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ స్టార్ హీరోయిన్ సమంతతో కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా కొంత వరకూ పూర్తైంది కానీ సమంత అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందుకు షూటింగ్ కాస్త లేటవుతోంది.