Liger : రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా లైగర్ (Liger). ఈ సినిమా కోసం మన రౌడీ హీరో అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో విడుదలైన విజయ్ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్నివ్వకపోవడంతో ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎప్పటికప్పుడు బయటకొస్తున్న కొన్ని విషయాలు ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. ఇప్పటిదాకా టాలీవుడ్ రౌడీ స్టార్ గా పిలిపించుకున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ కాబోతున్నారు. అంతేకాదు ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది.
Liger : 14 మంది అమ్మాయిలూ ఫారిన్ నుంచే..
లైగర్ సినిమాతో ఇండియాని షేక్ చేసేయబోతున్నాం అని పూరి జగన్నాథ్ చెబుతూ వస్తున్నారు. అందుకు తగ్గట్లుగా సినిమాలో ఎన్నో కొత్త కోణాలు ఆవిష్కరించబోతున్నారని టాక్. ఈ క్రమంలోనే సినిమాలో చాలా సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ చూపించబోతున్నారని సమాచారం. ముంబై బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఒక ఫైటింగ్ సన్నివేశం సినిమాకే హైలైట్ కానుందట. ఇందులో ఒకటి ఏకంగా 14 మంది అమ్మాయిలతో విజయ్ దేవరకొండ ఫైట్ సీన్ ఉండబోతోందట. ఈ సీన్ సినిమాలోనే హైలైట్ కానుందనే టాక్ బయటకొచ్చింది. 14 మంది అమ్మాయిలతో విజయ్ దేవరకొండ హోరాహోరీ పోరు చేశాడట. ఈ 14 మంది అమ్మాయిలు కూడా మార్షల్ ఆర్ట్స్‌లో నిపుణులని సమాచారం. వాళ్ళను ఫారెన్ నుంచి తీసుకొచ్చారని తెలుస్తోంది. ఈ ఫైటింగ్ సీన్ ప్రేక్షకులను బాగా అలరిస్తుందట.
కిక్ బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ (Mike Tyson) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ టైసన్ నుంచి స్ఫూర్తి పొందిన యువకుడిగా విజయ్ కనిపించబోతున్నాడు. అలా తనకి స్ఫూర్తినిచ్చిన టైసన్‌తోనే విజయ్ దేవరకొండ ఫైట్ చేయాల్సి రావడం, ఆ పోటీల్లో టైసన్‌ను విజయ్ దేవరకొండ ఓడించడం వంటి అంశాలు సినిమాకు హైలైట్ అని తెలుస్తోంది. మదర్ సెంటిమెంట్ కూడా ఆకట్టుకుంటుందని టాక్. విజయ్‌కు తల్లిగా రమ్యకృష్ణ తన నటనతో ఆకట్టుకోబోతున్నారు. ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో చూపించిన సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.