డ్రగ్స్ పై ప్రస్తుతం కేంద్రం చాలా సీరియస్ గా ఉంది.దానితో సంబంధాలు ఉన్న వారిపై ప్రస్తుతం ఉక్కుపాదం మోపే పనిలో చాలా బిజీగా ఉంది.అందుకే ఈ ఉదంతంలో బాలీవుడ్ స్టార్ హీరో అయినా షారుఖ్ ఖాన్ తనయుడిని సైతం అరెస్ట్ చేశారు.ఇప్పటికే షారుఖ్ తనయుడు మూడుసార్లు బెయిల్ కోసం అప్లై చేశాడు కానీ ఎన్‌సీబీ విచారణ కోసం సమయం కావాలని కోరడంతో అతని బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది.ప్రస్తుతం షారుఖ్ తనయుడి వద్ద లభ్యం అయిన వాట్స్ అప్ చాట్స్ ఆధారంగానే అనన్య పాండేను ఎన్‌సీబీ అధికారులు విచారించారు.
అయితే తాజాగా ఆమెను వచ్చే సోమవారం ఎన్‌సీబీ వారు అదుపులోకి తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది.దీనిపై స్పందించిన పలువురు విశ్లేషకులు ఆమెను తప్పక అరెస్ట్ చేస్తారని చెబుతున్నారు.ఒకవేళ ఇదే కానీ జరిగితే విజయ దేవరకొండ లైగర్ మూవీ షూటింగ్ ఆమె బెయిల్ తీసుకొని బయటకు వచ్చేవరకు అటకెక్కనున్నది.