కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ ఈ మధ్య వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్స్ తో ఎలా అయితే తన హవా కొనసాగిస్తున్నాడో అలాగే విజయ్ కూడా సౌత్ లో తన ఛరిస్మాని కొనసాగిస్తున్నాడు. ప్రతి సినిమాలో ఆయన మార్క్ హీరోయిజంతో పాటు అదిరిపోయే కథ, కథనాలు కూడా కుదరడంతో విజయ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నాయి. ఒకప్పుడు విజయ్ కి తెలుగులో అంతగా మార్కెట్ ఉండేది కాదు. కానీ తుపాకీ సినిమా తర్వాత తెలుగులో కూడా విజయ్ స్టార్ హీరోల రేంజ్ లో ఓపెనింగ్స్ సొంతం చేసుకుంటున్నాడు. మెర్సల్, అదిరింది, మాస్టర్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ ని విజయ్ ఖాతాలో వేసుకున్నాడు.
ఈ సినిమాలు తెలుగులో కూడా మంచి వసూళ్లు సంపాదించాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయ్ చెన్నైలో కొత్త ఇంటిని కొనుగోలు చేశాడు. అయితే మామూలుగా అయితే ఇది పెద్ద న్యూస్ అయ్యేది కాదు. కానీ విజయ్ కొన్న అపార్ట్మెంట్ ఖరీదు అక్షరాల 35 కోట్లు అని తెలుస్తుంది. దీంతో ఈ లగ్జరీ అపార్ట్మెంట్ గురించి కోలీవుడ్ లో న్యూస్ వైరల్ గా మారింది. ప్రస్తుతం విజయ్ చెన్నైలో ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉంటున్నారు. అయితే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ కావడంతో ఇళ్ళు మారాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.
ఈ నేపధ్యంలోనే చెన్నై నగరంలోనే ఖరీదైన ప్రాంతంలో లగ్జరీ అపార్ట్మెంట్ ని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. అడయార్ ప్రాంతంలో విజయ్ ఆఫీస్ ఉంది. ఇక దానిని కూడా కొత్త ఇంటికి మార్చాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ హౌస్ కి షిఫ్ట్ అవుతాడని టాక్. ఇక కోలీవుడ్ లో మరో హీరో ఆర్య కూడా అదే అపార్ట్మెంట్స్ లో ఉంటున్నాడని తెలుస్తుంది. ఇదిలా ఉంటే హీరో విజయ్ తెలుగు, తమిళ్ లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారసుడు సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత మరల లోకేష్ కనగారాజ్ దర్శకత్వంలో నటించబోతున్నాడు.