తమిళ స్టార్ హీరో విజయ్ కు తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.అందుకే ఆయన సినిమాలను ప్రొడ్యూసర్ లు తెలుగులో కూడా డబ్ చేస్తుంటారు.ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ బీస్ట్ అనే మూవీ చేస్తున్నారు.ఈ మూవీలో విజయ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ తెలుగు రైట్స్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఫ్యాన్సీ అమౌంట్ కు సొంతం చేసుకున్నారు.ఈ మూవీని రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా గ్రాండ్ గా రిలీజ్ చేసే ప్లాన్ లో ఆయన ఉన్నారని సమాచారం.