స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ పెళ్లి చేసుకొని ఇంకా ఏడాది సమయం కూడా కాలేదు. కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ తమకి కవలలు పుట్టారని ఒక ఫోటోని ట్విట్టర్ పోస్ట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. అయితే ఐదు నెలల్లో గర్భం దాల్చకుండా పిల్లలు ఎలా పుట్టారంటూ వారిపై విమర్శలు మొదలయ్యాయి. ఇండియాలో సరోగసి విధానంపై నిషేధం ఉండగా ఏ విధంగా పిల్లలని కన్నారో వివరణ ఇవ్వాలని తమిళనాడు సర్కారు కూడా వారికి నోటీసులు పంపించింది. కొంత మంది సెలబ్రెటీలు అయితే గర్భందాల్చితే అందం పోతుందని భయంతో నయనతార ఇలా సరోగసి ద్వారా పిల్లలని కన్నదని, ఈ మధ్య సెలబ్రెటీలు అందరికి ఇదొక అలవాటుగా మారిపోయిందని విమర్శలు చేశారు.
ఇక కవల పిల్లలు పుట్టారనే ఆనందం కంటే వారు ఎలా పుట్టారు అనే ప్రశ్నలు, విమర్శలతో ఇప్పుడు నయన్, విగ్నేష్ దంపతులకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. వీరిపై కేసు కూడా నమోదైనట్లు తెలుస్తుంది. వీరు ఇండియాలో సరోగసి విధానంలో పిల్లలని కన్నట్లు ప్రూవ్ అయితే ఐదేళ్లజైలు శిక్ష పడుతుందని కూడా ప్రెడిక్ట్ చేస్తూ చెబుతన్నారు. మరి తమిళనాడు సర్కారుకి వారు ఎలాంటి వివరణ ఇస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇదిలా ఉంటే తాజాగా నయనతార భర్త విగ్నేష్ శివన్ ఈ ప్రచారంపై స్పందించారు.
అభిమానులు అందరూ కొంత కాలం ఎదురుచూడాలని, నిజాలు అన్ని కూడా నెమ్మదిగా తెలుస్తాయని, ఎవరూ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. అతని ట్వీట్ బట్టి తాము న్యాయబద్ధంగానే పిల్లల్ని కన్నామని ప్రూవ్ చేసుకోవడానికి అన్ని ఆధారాలు సిద్ధం చేసుకున్నారనే మాట వినిపిస్తుంది. అందుకే విగ్నేష్ అంత ధైర్యంగా ట్వీట్ చేశారని చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా కోలీవుడ్ ఇప్పుడు నయనతార కవల పిల్లలు ఇష్యూ సోషల్ మీడియాలో సెన్సేషన్ టాపిక్ గా మారిపోయింది.