Vicky Koushal : బాలీవుడ్ యాక్టింగ్ స్టార్ విక్కీ కౌషల్ కత్రినాను పెళ్లి చేసుకున్న తరువాత కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ తెరమీద సందడి చేస్తున్నాడు. తనదైన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను మరోసారి ఇంప్రెస్ చేస్తున్నాడు. రీసెంట్ గా గోవిందా నామ్ మేరా చిత్రంలో బాయ్‌ఫ్రెండ్‌గా, భర్తగా నటించి ఈ తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో విక్కీ కౌషల్, కియారా అద్వానీలు ఇద్దరూ అమితాబ్ బచ్చన్ షోకు హాజరై సందడి చేశారు. ఈ షోలో విక్కీకి ఉన్న అందమైన సమస్య గురించి చెప్పి అభిమానులను షాక్‌కు గురి చేశాడు.

ఎక్స్‌ట్రా ఫ్యాట్‌ను కోల్పోవడం అంత తేలికైన పని కాదు. దీనికి సమయం, అంకితభావం, వ్యాయామం సరైన ఆహార ప్రణాళిక అవసరం. కానీ ప్రముఖ బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ మాత్రం అందుకు విరుద్దం అనే చెప్పాలి. తన నటనా నైపుణ్యంతో, సన్నగా ఉండే శరీరాకృతికి పేరుగాంచిన విక్కీ ఇటీవల తనకు చాలా అందమైన సమస్య ఏర్పడిందని పేర్కొన్నాడు. అది ఏమిటో మీరు ఊహించగలరా? డెఫినెట్‌గా ఊహించలేరు విక్కీ కౌశల్ ప్రస్తావించిన సమస్య ఏమిటంటే అతను సులభంగా బరువు పెరగడట. నిజానికి, విక్కీ మాట్లాడుతూ, కొంత బరువు పెరగడానికి అదనపు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది అని అన్నారు. గోవింద నామ్ మేరా నటుడు, సహనటి కియారా అద్వానీతో కలిసి ఇటీవల నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసిన క్విజ్ షోలో పాల్గొన్నాడు. ఆహారం, బరువు పెరుగటం గురించి మాట్లాడుతూ, విక్కీ తన అందమైన సమస్య గురించి అతనిలాంటి పంజాబీ కి ఎలా ప్రయోజనకరంగా ఉంటుందో ప్రస్తావించాడు.

విక్కీ కౌశల్ అబితాబ్ బచన్‌తో ఏమన్నాడంటే సార్, నాకు అందమైన సమస్య ఉంది సార్. నేను సాధారణంగా బరువు పెరగను అని పేర్కొన్నాడు ఈ మాట విన్న అమితాబ్ బచ్చన్ కియారా అద్వానీ లు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. అక్కడితో ఆగకుండా నేను బర్గర్, పిజ్జాలు తింటూ బరువు తగ్గగలను అని అందరినీ అవాక్కు చేశాడు. అంతేకాదు 34 ఏళ్ల ఈ నటుడు తాను బరువు పెరగడానికి చలా కష్టపడ్డానని చెప్పాడు. బరువు పెరగడానికి మీరు ఏమి చేస్తారు? అని అమితాబ్ బచ్చన్ అడిగినప్పుడు, అప్పుడు నేను చాలా బోరింగ్‌గా ఏదైనా తింటే చాలు పెరిగిపోతాను అని అన్నాడు.
ఈ విషయం మిమ్మల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది కదా. ఇక ఈ ఇంటర్వ్యూ చూసిన వారంతా విక్కీ కౌశల్ వంటి అందమైన సమస్య ఉండాలని కోరుకుంటున్నారట.