Venu Swamy : నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ఎప్పటినుంచో చర్చ నడుస్తోంది. సినిమా రెడీ.. డైరెక్టర్ రెడీ అంటూ ఎన్నో కథనాలు వచ్చాయి. ఆ తరువాత మోక్షజ్ఞ వెయిట్ తగ్గడానికి విదేశాలకు వెళ్లాడని.. రాగానే సినిమా స్టార్ట్ అని కూడా అన్నారు. కానీ మోక్షజ్ఞ బాగానే శ్రమిస్తున్నారని ప్రస్తుతం ఆయన బాడీ ట్రాన్స్‌ఫర్‌మేషన్ చూస్తుంటే అర్థమవుతోంది. కానీ సినిమా ఊసే లేదు. అసలు నిజంగా మనోడికి హీరో అయ్యే యోగం ఉందా? ఒకవేళ అయితే స్టార్ హీరో రేంజ్‌కి ఎదుగుతాడా? లేదా? అనే విషయాలను తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి వెల్లడించారు.
మొత్తానికి అంతా సిద్ధమై పోయిందని.. ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలకృష్ణ పక్కాగా ప్లాన్స్ చేశారని టాక్. మోక్షజ్ఞ ఎంట్రీలో తన పాత్ర మెయిన్ అని ఇదివరకే బాలయ్య ప్రకటించిన విషయం అభిమానులకు తెలిసే ఉంటుంది. మోక్షజ్ఞతో ఆదిత్య 369 సీక్వల్ ప్లాన్ చేస్తున్నారని కూడా టాక్ నడిచింది. మరి ఆచరణలో మాత్రం ఏమీ కనిపించడం లేదు. తాజాగా మోక్షజ్ఞ విషయంలో ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఆయన సినీ ఎంట్రీ బాగా లేటవుతుందని.. లేటు అయినా కూడా స్టార్‌గా ఎదగడం ఖాయమని వేణు స్వామి వెల్లడించారు.
మోక్షజ్ఞ భవిష్యత్ అదిరిపోతుందన్నారు. సినిమాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటాడని వేణు స్వామి తెలిపారు. అంతేకాదు.. రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. ఎన్టీఆర్ మనవడు కాబట్టి మోక్షజ్ఞ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడా? అనే అనుమానం ఉంటుంది. అయితే ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడని చెప్పి నందమూరి ఫ్యాన్స్‌కు వేణుస్వామి షాక్ ఇచ్చారు. సినిమాల ద్వారానే మోక్షజ్ఞకు లైఫ్ ఉంటుందని వెల్లడించారు. అయితే ఇప్పుడు వేణు స్వామి చెప్పిన విషయాలు నందమూరి అభిమానులను సంతోషంలో ముంచెత్తుతున్నాయి. ఇప్పటి వరకూ సందిగ్దంలో ఉన్న అభిమానులకు ఆయన మాటలతో కొంత క్లారిటీ వచ్చింది.