Venkatesh Maha: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ మూవీ మొదటి సినిమా కంటే మూడు రెట్లు అధికంగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇండియన్ వైడ్ గా ఏకంగా 1200 కోట్లని కేజీఎఫ్ చాప్టర్ మూవీ కొల్లగొట్టింది. ఇక ప్రశాంత్ నీల్ ఈ మూవీతో ఏకంగా స్టార్ దర్శకుడిగా మారిపోవడంతో పాటు ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో సినిమాలని లైన్ లో పెట్టుకున్నారు. స్టార్ హీరోలు అందరూ కూడా ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కేజీఎఫ్ చాప్టర్ లో రాఖీ భాయ్ పాత్ర పై టాలీవుడ్ యువ దర్శకుడు వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ముఖ్యంగా వెంకటేష్ మహా చాలా వ్యంగ్యంగా రాఖీ భాయ్ క్యారెక్టర్ ని సృష్టించిన ప్రశాంత్ నీల్ నే టార్గెట్ చేసే విధంగా వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఒక యుట్యూబ్ చానల్ లో టాలీవుడ్ దర్శకుల చర్చాగోష్టి జరిగింది. అందులో వెంకటేష్ మహా మాట్లాడుతూ ఈ మధ్య ఒక సినిమాలో అమ్మ గొప్పోడు అవ్వు అని చెప్పిందని హీరో గొప్పోడు అయిపోతాడు. గొప్పోడు అంటే భాగా సంపాదించి సమాజానికి సేవ చెయ్యు అనేది ఆమె దృష్టిలో మాట. కాని హీరో మాత్రం బంగారం సంపాదించి తనని నమ్ముకున్న వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు కట్టేసి ఆ బంగారం మొత్తం తీసుకొని వెళ్లి సముద్రంలో కలిపేస్తాడు. ఏ నీచ కమీన్ కుత్తే అయిన ఎలా చేస్తాడా.. కాని హీరో చేసాడు.
అలాంటి సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేసి కలెక్షన్స్ ఇచ్చారు అంటూ వెంకటేష్ మహా చెప్పుకొచ్చారు. అయితే ఆయన అగ్రిసివ్ గానే తన ఇగోని చూపిస్తూ కేజీఎఫ్ చాప్టర్ 2లో రాఖీభాయ్ పాత్ర గురించి మాట్లాడటం, అదే సమయంలో అక్కడ ఉన్న మిగిలిన దర్శకులు వ్యంగ్యంగా నవ్వుతూ ఉండటం ఆ వీడియో వైరల్ గా మారింది. దీంతో ఇప్పుడు కన్నడ సినిమా అభిమానులు, రాకీ భాయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వెంకటేష్ మహాని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. చేసింది రెండు సినిమాలు, అందులో ఒకటి రీమేక్ మూవీ. అప్పుడే ఇంత నోటి దూల అయితే ఇక నీలాంటి వాడితో ఏ హీరో సినిమాలు చేస్తాడు అంటూ విమర్శలు చేస్తున్నారు. మరి దీనిపై వెంకటేష్ మహా ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.